Friday, March 29, 2024
- Advertisement -

నో డౌట్……. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లిద్దరూ వెన్నుపోటు వీరులే…. ఒకరు మామకు… మరొకరు అన్నకు

- Advertisement -

అజ్ఙాతవాసి సిినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే పవన్‌కి ప్రజలు గుర్తొచ్చారు. ప్రజల మధ్యకు వచ్చాడు. అయితే ఆ సారి మాత్రం జనాలకు పవన్ కళ్యాణ్ అస్సలు కనిపించలేదు. చంద్రబాబునాయుడికి కాపీ పేస్ట్‌లా అనిపించాడు. పవన్ మాటలన్నీ చంద్రబాబు తరహాలోనే….. పవన్ ఎంచుకున్న మార్గం కూడా చంద్రబాబు తరహాలోనే ఉంది.

1994కు ముందు వరకూ ప్రతిపక్షంలో ఉన్నాడు ఎన్టీఆర్. ఆ టైంలో ఎన్టీఆర్‌ని కుటుంబ సభ్యులతో సహా ఎవ్వరూ పట్టించుకోలేదు. చంద్రబాబు ఆ విషయంలో చేసిందేమీ లేదు. ఎన్టీఆర్ పక్కన ఉన్న వ్యక్తి లక్ష్మీపార్వతి. 1994 ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్టీఆరే చెప్పుకున్నట్టుగా…..తన పనులు తాను చేసుకోలేని ఎన్టీఆర్‌కి అండగా నిలిచింది లక్ష్మీపార్వతి. అందుకే ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిల వివాహాన్ని ఆయన అభిమానులతో పాటు ప్రజలు కూడా ఆశీర్వదించారు. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా ఎన్టీఆర్‌కి పట్టం కట్టారు. అయితే అధికారం వచ్చిన వెంటనే చంద్రబాబునాయుడితో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు కూడా ఎన్టీఆర్‌పై ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత లక్ష్మీపార్వతిని చాలా పెద్ద బూచీలా చూపించి ఎన్టీఆర్ దగ్గర నుంచి దొంగదారిలో అధికారం లాక్కున్నారు. ఆయన పార్టీని కూడా సొంతం చేసుకున్నాడు చంద్రబాబు. ఎన్టీఆర్‌కి విలువలు లేవు అని విమర్శించాడు. ఒక రకంగా బ్రతికినంత కాలం మహారాజులా బ్రతికిన ఎన్టీఆర్ చివరి దశలో నరకం చూశాడు. బ్రతికుండగా ఎన్టీఆర్‌కి నరకం చూపించిన వాళ్ళే ఆయన చనిపోయిన వెంటనే ఆయన ఇమేజ్‌ని అక్కున చేర్చుకున్నారు. అధికారం కోసం అన్ని రకాల కుట్రలకూ పాల్పడ్డారు. ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వాళ్ళే ఆయన ఆస్తులను, ఇమేజ్‌ని వాడుకుంటున్నారు. అధికారంలో లేని సమయంలో ఎన్టీఆర్ పక్కన ఉన్న లక్ష్మీపార్వతి ఇప్పుడు పదివేల రూపాయల అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. అధికారంపై ఆశ మానవత్వ విలువలను చంపేసిన చరిత్ర అది.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఒక అమూల్యమైన మాట అన్నాడు. చిరంజీవికి ద్రోహం చేసిన వాళ్ళకు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తానన్నాడు. అలా కొట్టాల్సి వస్తే మొదటి చెప్పు దెబ్బ ఎవరికి పడాలో ఈ విషయం చదివాక ఆయన అభిమానులే చెప్పాలి. పవనే చెప్పుకున్నట్టుగా చిరంజీవి పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో పవన్ కూడా ఒకడు. అన్ని విధాలుగా చిరంజీవిని ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత పార్టీలో చిరంజీవి తర్వత నంబర్ టూ లీడర్‌గా, యువరాజ్యం అధ్యక్షుడిగా పదవి తీసుకున్నాడు. చాలా తెలివిగా ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. ఎందుకంటే చిరంజీవి అధికారంలోకి వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ మంత్రి పదవి తీసుకోవడం చాలా సులభం కాబట్టి. ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే 2014లో నారా చంద్రబాబు-లోకేష్‌లు చేసిన రాజకీయం గురించి తెలుసుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్స్ కావాలన్న టిడిపి సీనియర్ నాయకుల పిల్లలతో లోకేష్ ఒక అమూల్యమైన మాట చెప్పాడు. ‘ఈసారికి సీనియర్స్‌కి అవకాశం ఇద్దాం……మనమందరం సైనికుల్లా కష్టపడదాం……2019లో మనం పోటీ చేద్దాం’ అని చెప్పాడు. వాళ్ళందరికీ టికెట్స్ ఇవ్వలేదు. లోకేష్ కూడా పోటీ చేయలేదు. కానీ అదే లోకేష్ ఏం చేశాడు? తండ్రి ముఖ్యమంత్రి అవగానే ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుని ఏకంగా కేబినెట్ మంత్రి అయిపోయాడు. ప్రభుత్వంలో నెంబర్ టూ అయ్యాడు. సీనియర్ నాయకుల వారసులందరూ బకరాలయ్యారు. అలా ఉంటుంది రాజకీయం. చిరంజీవి అధికారంలోకి వచ్చి ఉంటే పవన్ కూడా మంత్రి అయ్యేవాడు అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. ఒకవేళ అది ఊహాగానమే అనుకుందాం. మరి ఒక పార్టీ అధినేతకు నాయకుల అవసరం ఎప్పుడు ఉంటుంది? అధికారంలో ఉన్నప్పుడా? అధికారంలో లేనప్పుడా? అధికారంలో ఉండి ఉంటే ఇప్పుడు జగన్ పార్టీ నాయకులు ఎవరైనా పార్టీ మారేవారా? అధికారంలో లేనప్పుడు చంద్రబాబు వెంట ఉన్న నాయకులు ఎంతమంది గోడ దూకెయ్యలేదు? అంటే పార్టీ అధికారంలో లేనప్పుడు అండగా ఉన్నవాళ్ళే నిజమైన సహచరులు. నిజాయితీ ఉన్న నాయకులు. కానీ పవన్ ఏం చేశాడు? ఓడిపోయిన వెంటనే చిరంజీవి ఖర్మకు చిరంజీవిని వదిలేశాడు. కనీసం ఒక్క ప్రెస్ మీట్ అన్నా పెట్టి చిరంజీవి గురించి చెప్పాలని పవన్‌కి అనిపించలేదు. పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన తర్వాత చిరంజీవిపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏకంగా చిరంజీవికి దూరమయ్యాడు. చిరంజీవి చేస్తున్న తప్పులను పవన్ వ్యతిరేకిస్తున్నాడని, పవన్‌కి చిరంజీవికి పడడం లేదన్న ఫీలర్స్ పవన్ క్యాంపు నుంచే వచ్చాయి. ఆ రకంగా చిరంజీవి చేసింది పాపం అని పవనే ఎక్కువగా నిరూపించాడు. ఆ పాపం తనకు అంటకుండా చాలా తెలివిగా రాజకీయం చేశాడు. మూడు దశాబ్ధాలుగా చిరంజీవి కష్టపడి తెచ్చుకున్న మంచిపేరు మొత్తం పోయేలా చేశాడు. చిరంజీవికి విలువల్లేవు……పవన్ మాత్రం మణిపూస అని ప్రచారం జరిగేలా చేసుకున్నాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేసింది లేదు కాబట్టి…..అప్పటికి ఇంకా చిరంజీవిపై ఉన్న బ్యాడ్ ఇమేజ్ జనాల మదిలో ఉంది కాబట్టి చిరంజీవిని వాడుకోలేదు.

ఇప్పుడిక రేపో మాపో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం కూడా పూర్తవనుండడంతో చిరంజీవికి కాంగ్రెస్‌కి బంధం తెగిపోవడం ఖాయం. 2019లో సొంతంగా పోటీ చేసే యోచనలో ఉన్న పవన్‌కి ఇప్పుడు చిరంజీవి అవసరమయ్యాడు. అందుకే చిరంజీవికి అన్యాయం చేసిన వాళ్ళను చెప్తుతో కొడతాడట.

మెగాభిమానులూ ఇప్పుడు చెప్పండి…….తాను పునీతుడిని అని చెప్పుకోవడం కోసం చిరంజీవి వ్యక్తిత్వాన్ని పూర్తిగా నాశనం చేసినది ఎవరు? పార్టీ పెట్టినప్పుడు, అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకున్నప్పుడు పార్టీ పదవులు తీసుకుని…..ఎన్నికల్లో ఓడిపోగానే జెండా ఎత్తేసింది ఎవరు? చిరంజీవికి పవన్ వెన్నుపోటు పొడవలేదని చెప్పగలరా?

అసలు విషయం ఏంటంటే అన్నదమ్ములిద్దరి రాజకీయం కూడా ఆంధ్రప్రదేశ్‌కి చాలా నష్టం చేసింది. ప్రజారాజ్యం పార్టీ లేకపోయి ఉండి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయేది. రాష్ట్ర విభజన వ్యవహారం ఇంకోలా ఉండేది. ఇక 2014లో పవన్ సపోర్ట్ లేకుండా ఉండి ఉంటే రాజీకయాలు మరోలా ఉండేవి. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం, రాజధాని నిర్మాణ వ్యవహారాలు ఇంత దారుణంగా అయితే ఉండేవి కావు. మొత్తానికి మెగా బ్రదర్స్ ఇద్దరూ కూడా తమ టైం పాస్ రాజకీయ వ్యవహారాలతో సీమాంధ్రను నిలువునా ముంచారు.

పవన్ ఇప్పుడు చెప్పే అబద్ధాలు కూడా భలే ఉంటాయి. నిన్నటికి నిన్న రాజకీయాలు బాగుండి ఉంటే సినిమాలను వదిలేసే వాడిని కాదు అన్నాడు. పవన్ సినిమాలను వదిలేశాడా? రామ……..రామ………ఇలాంటి వ్యక్తిలోనా? సినిమా జనాలకు నిజాయితీ కనిపించింది. ఇలాంటి వ్యక్తిని బాబు భజన మీడియా మొత్తం నిజాయితీపరుడని చెప్పి సీమాంద్రజనాలను నమ్మించిందా? ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి…..ఆయన పార్టీని లాక్కుని…..ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి చంద్రబాబు కాబట్టే సమర్థవంతంగా నడిపిస్తున్నాడు…….అందుకు ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడున్నా గర్వపడుతూ ఉంటుంది అని నమ్మించగలిగినవాళ్ళకు……..పవన్‌ని నిజాయితీపరుడిగా చూపించడం ఒక లెక్కా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -