Saturday, May 4, 2024
- Advertisement -

నిజమే.. ఆ గుళ్లో శివలింగంకదులుతుందట..!!

- Advertisement -
moving lord shiva statue in dugdheshwar nath ji rudrapur deoriya uttar pradesh

శివలింగం కదలటం ఏంటి అనిఆశ్చర్యపోతున్నారు కదూ.. నిజమేనండి. ఆ గుళ్లో శివలింగం కదులుతూ ఉంటుంది. ఉత్తరప్రదేశ్, దియోరియా జిల్లాలోని రుద్రపురంలో  ఓ శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఉన్న శివలింగం కదులుతూఉంటుందని అక్కడి అర్చకులు చెబుతున్నారు.

మధ్యప్రదేశ్ లో ఉన్న మహాకాళేశ్వరజ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అని, ఈశివుడిని  దుగ్దేశ్వరనాధుడు అంటారనిచెబుతున్నారు. ఈ శివలింగానికి రెండువేలసంవత్సరాల చరిత్ర ఉంది. శివలింగం కదలటం మొదలైతే… ఒక గంటైనా కదలచ్చు, లేకపోతే రోజంతా కదులుతూనే ఉండొచ్చు. లేకపోతే ఎవరు కదిపినా అస్సలు కదలదట. సాధారణంగా శివలింగాలన్నీ పానమట్టము మీదే ఉంటాయి.

కానీ  ఈ శివలింగానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ లింగం పానమట్టము మీద కాకుండా భూమి మీదనేప్రతిష్టించారు. అసలు ఈ శివలింగం కదలడానికి గల కారణాలు తెలుసుకోడానికి చాలా మంది ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ అధికారులు పరిశోధనలు చేశారు. అయితే  భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉన్నదోతెలుసుకోవటానికి వాళ్లు  ఎంత త్రవ్వినా ఆజాడ కూడా తెలియకపోవటంతోవిఫలమయ్యారట. వారు తవ్విన కొద్ది శివలింగం కనిపిస్తూనే ఉంది కానీ మొదలు మాత్రం కనిపెట్టలేకపోయారు.

ఇక స్వామివారు కదులుతున్న సమయంలోదర్శన కోసం భక్తులు  బారులు తీరుతారట.దేవుడి లీలల్లో  ఇదీ ఒకలీలగాపరిగణిస్తున్నారు అక్కడి స్ధానికులు.

Related

  1. ఫ్రీగా ఫేస్‌బుక్‌ను వాడలంటే ఇలా చేయండి!
  2. మన ఆరోగ్యం ….. మన చేతుల్లో
  3. చలికాలంలో పాదాల పగుళ్లు వేధిస్తున్నాయా..?
  4. పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -