Saturday, April 27, 2024
- Advertisement -

మనసు మార్చుకున్న పవన్..ఎంపీగా పోటీ!

- Advertisement -

ఊహించిందే జరుగుతోంది. పవన్ తన స్థానం ప్రకటించకవపోటం వెనుక వ్యూహం కాదు భయం. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారని వారం క్రితం లీకులు ఇచ్చారు. ఎక్కడ ఓడారో అక్కడే రికార్డు మెజార్టీ సాధిస్తారని జనసేన నేతలు ఊదరగొట్టారు. ఇప్పుడు పవన్ భీమవరం నుంచి పోటీ చేయటం లేదని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పిఠాపురం స్థానం మాత్రమే సేఫ్ సీట్ గా భావిస్తున్నారు. అక్కడ పోటీకి సిద్దం అవుతున్నారని పార్టీ నేతల సమాచారం. అదే సమయంలో రాష్ట్రంలో తమ కూటమి విజయం పైన నమ్మకం పోయినట్లు ఉంది.

అందుకే విచిత్రంగా ఎమ్మెల్యేతో పాటుగా ఎంపీగానూ పోటీ చేయనున్నట్లు జనసేన ముఖ్య నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అందరూ భావిస్తున్నట్లుగా అనకాపల్లి నుంచి నాగబాబు కాకుండా పవన్ పోటీకి దిగే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాకపోతే బీజేపీ నేతలను మచ్చిక చేసుకొనేందుకు ఎంపీగా వెళ్లాలనేది ఆలోచనగా కనిపిస్తోంది. ఇక్కడే మరో కీలక అంశం ఉంది. పవన్ కు పొత్తులో 24 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. పవన్ ఇప్పటి వరకు అయిదు స్థానాలకు మాత్రమే అభ్యర్దులను ప్రకటించారు. తాను పోటీ చేసే స్థానం ప్రకటించకపోవటం వెనుక కూడా ఇలా ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే ప్రతిపాదన ఒకటైతే..మరో ముఖ్య కారణం ఉంది.

జనసేన నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి కూడా తన పార్టీ నుంచీ టీడీపీ వాళ్లకే అవకాశం ఇస్తారనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు అదే నిజం చేస్తూ భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరుతున్నారు. పవన్ భీమవరం నుంచి పిఠాపురం నుంచి పోటీ మార్పు ప్రకటించిన తరువాత భీమవరం నుంచి జనసేన అభ్యర్దిగా రామాంజనేయులు పోటీకి లైన్ క్లియర్ చేస్తున్నారు. దీని ద్వారా పవన్ ప్రకటించాల్సిన 19 స్థానాల్లో మరో రెండు నియోజకవర్గాల్లో స్పష్టత వచ్చినట్లే మిగిలిన 17 స్థానాల్లో నిజమైన జనసేన నేతలకు ఎన్ని దక్కుతాయనేది ఇప్పుడు ఆ పార్టీలో నేతలకే అంతు చిక్కని అంశంగా మారుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -