Thursday, May 23, 2024
- Advertisement -

ఈ మాత్రుమూర్తికి…శ‌త‌కోటి వంద‌నాలు…

- Advertisement -

సృష్టిలో అమ్మ‌కు ఉన్న ప్రాధాన్య‌త ఎవ‌రికీ లేదు. అమ్మ ఎవరికైనా ఎక్క‌డైనా అమ్మే. త‌మ‌కు పుట్టిన బిడ్డ‌ల‌కు పాలు ఇవ్వాలంటె ఎక్క‌డ త‌మ గ్లామ‌ర్ త‌గ్గిపోతాదోన‌నే త‌ల్లులు ఉన్నారు. కాని ఇక్క‌డున్న ఫోటో వెనుక ఉన్న ఈ అమ్మ స్టోరీ వింటె ఆశ్చ‌ర్య‌పోతారు.

పైన ఫోటోలో జింక పిల్ల‌కు పాలిస్తున్న ఈమె రాజ‌స్థాన్‌లోని బిష్ణోయ్ స‌మాజిక వ‌ర్గానికి చెందిన‌మ‌హిళ‌. అంటారు. ఈ ఫొటో వెనుకున్న స్టోరీ గురించి తెలుసుకుంటే మీరు అదే అంటారు. ఈ చిత్రంలో జింకపిల్లకు పాలిస్తున్న అమ్మ రాజస్థాన్‌లోని బిష్ణోయ్‌ సామాజిక వర్గానికి మహిళ. ప్రముఖ షెఫ్ వికాస్‌ ఖన్నా ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇది ఇప్పుడు సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్‌గా అయ్యింది.

మాన‌వ‌త్వానికి చిరునామాగా నిలిచిన ఈ మాతృమూర్తి గురించి ఇలా చెప్పుకొచ్చారు. పాలిస్తున్న‌ది ఈ ఒక్క జింక పిల్ల‌కే కాదు…త‌న జీవిత కాలంలో చాలా జింక‌ల‌కు చనుబాలిచ్చినట్టు ఆమె నాతో చెప్పింద‌న్నారు షెఫ్ వికాస్‌ ఖన్నా. రాజస్థాన్ ఎడారుల్లో అనాథలుగా మిగిలిన, గాయపడిన ఎన్నో జింక పిల్లల ప్రాణాలు ఈవిధంగా కాపాడినట్టు వెల్లడించార’ని వికాస్‌ ఖన్నా వివరించారు. ప్రకృతిలోని చెట్లు, జంతువుల పట్ల బిష్ణోయ్‌ మహిళలు ఎంతో అనురక్తి కలిగివుంటారని వ్యాఖ్యానించారు.

సామాజికి మాధ్య‌మాల్లో షేర్ చేసిన ఈ ఫోటో కొద్ది గంట‌ల్లోనె వేలాది లైక్‌లు, కామెంట్స్ వ‌చ్చాయి. బిష్ణోయ్‌ మహిళల పర్యావరణ ప్రియత్వాన్ని, సహృదయతను మెచ్చుకుంటూ కామెంట్లు వచ్చాయి. చిప్కో ఉద్యమంలో బిష్ణోయ్‌ మహిళలు ముందుండి పోరాడారని, కృష్ణ జింకలను తమ సొంత పిల్లల్లా సాకుతారని పలువురు ట్వీట్‌ చేశారు. మాన‌వ‌త్వానికి చిరునామాగా నిలిచిన ఈ మాతృమూర్తికి శ‌త‌కోటి వంద‌నాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -