Friday, May 17, 2024
- Advertisement -

జగన్ సిఎం: వైఎస్ చనిపోయాక సాగిన సంతకాల వ్యవహారంపై అసలు నిజాలు ఇవిగో

- Advertisement -

తండ్రి అంత్యక్రియలు పూర్తవకముందే వైఎస్ జగన్ సిఎం కుర్చీ కోసం ఆశపడ్డాడా? సోనియాగాంధీకి జగన్‌ని సిఎం చేయమని చెప్పడం కోసం సంతకాల సేకరణ చేపట్టాడా? వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హరించడం కోసం సాగిన విషప్రచారాల్లో ఇదొకటి. టిడిపి, కాంగ్రెస్, చిరంజీవిలు కలిసి ఎంత విషం చల్లాలో అంతా చేశారు. ఇక పచ్చ మీడియా అయితే నీచమైన ప్రచారం చేసింది. పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కుని, ఎన్టీఆర్‌కి చివరిదశలో ఆత్మక్షోభను మిగిల్చిన చంద్రబాబు సుద్దపూస. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్‌లో బాబుకు సహకరించిన బాలకృష్ణ ఇంకా సుద్దపూస. వాళ్ళ గురించి ఏమీ మాట్లాడరు. కళ్ళ ముందు జరిగిన ఘోరం గురించి ఎవరూ మాట్లాడరు. కానీ జగన్ గురించి మాత్రం నిజానిజాలతో పనిలేకుండా చెప్పిందే చెప్పి……పదే పదే చెప్పి జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తారు.

వైఎస్ జగన్‌ని సిఎం చేయాలంటూ సాగిన సంతకాల వ్యవహారం గురించి ఈరోజు విజయమ్మ కొన్ని నిజాలు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యనాయకుడుగా ఉన్న ఆ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గురించి కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా రోశయ్యను నియమిస్తానని సోనియాగాంధీ చెప్తే జగన్ వెంటనే ఒకే అన్నాడు. అయితే రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు మాత్రం ఆ నిర్ణయానికి ఒప్పుకోవద్దని జగన్‌కి పదే పదే చెప్పారట. ఇక ఇలాంటి నాయకులే మాట మీద నిలబడతారు, తోడుగా నిలిచిన వాళ్ళకు పది రెట్లు సాయం చేస్తారు అన్న వైఎస్‌లపై ఉన్న నమ్మకంతో వైఎస్ జగన్‌కి తోడుగా ఉన్నామని నిరూపించుకోవడం కోసం, వైఎస్ జగన్‌ని సిఎం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించడం కోసం ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారట. సీనియర్ మోస్ట్ రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో చెప్తున్న ఇదే విషయాలను ఇప్పుడు పరోక్షంగా వైఎష్ విజయమ్మ చెప్పుకొచ్చారు. జగన్ చుట్టూ చేరి జగన్‌కి మంచి చేస్తున్నట్టుగా కనిపించడం….తేడా వస్తుందేమో అన్న భయంతో సోనియాకు తగ్గట్టుగా కూడా నటించడం….ఇక ముఖ్యమంత్రి టార్గెట్ మిస్సయిన మెగాస్టార్ కూడా మద్ధతిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయం అన్న ఉద్ధేశ్యంతో అత్యుత్సాహం చూపించారట. అయితే కాంగ్రెస్‌లో ఉన్న వైఎస్ ప్రత్యర్థులు సోనియాకు జగన్‌ గురించి చెడుగా చెప్పడంతో సోనియా వెనక్కి తగ్గారు. ఇక ఆ వెంటనే అందరూ కూడా ఆ సంతకాల సేకరణ విషయం సోనియాకు తెలిస్తే జగన్‌పై ఉన్న వ్యతిరేకత తమపైన కూడా పడుతుందేమో అన్న భయంతో ఆ సంతకాల సేకరణ బురద మొత్తం జగన్‌కి ఆపాదించారు. ఇక ఆ సమయంలోనే చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డి, చిరంజీవిలు కలిసి నడిపిన కుమ్మక్కు రాజకీయాల గురించి తెలియనిదెవరికి? అందరూ కలిసి వైఎస్ జగన్‌ని విలన్‌ని చేయడం కోసం సాగించిన రాజకీయ కుట్రనే ఈ సంతకాల సేకరణ కార్యక్రమం కూడా అని నాటి రాజకీయాలను దగ్గరగా పరిశీలించిన సీనియర్ జర్నలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -