రీల్ జంటలు రియల్ లైఫ్ లో ఒక్కటైన హీరో, హీరోయిన్లు..!

- Advertisement -
సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించి ప్రేమలో పడి.. రియల్ లైఫ్ లో పెళ్లిలు చేసుకున్న హీరో, హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

కృష్ణ – విజయ నిర్మల: ‘సాక్షి’ చిత్రంలో జంటగా నటించిన కృష్ణ, విజయ నిర్మల.. ప్రేమలో పడ్డారు. అప్పటికే వీరికి పెళ్ళైనప్పటికీ మళ్ళీ వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇంకా ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు.

- Advertisement -

రాజశేఖర్ – జీవిత: ‘తలంబ్రాలు’ ‘అంకుశం’ వంటి చిత్రాల్లో భార్యా భర్తలుగా నటించిన రాజ శేఖర్, జీవిత లు.. ఆ తరువాత నిజంగానే పెళ్లి చేసుకుని జంటగా మారారు.

నాగార్జున – అమల: ‘శివ’ ‘నిర్ణయం’ వంటి సినిమాల్లో జంటగా నటించిన నాగార్జున- అమల నిజ జీవితంలో కూడా వివాహం చేసుకుని జంటగా మారిన సంగతి తెలిసిందే.

అర్జున్ సర్జా- నివేదిత: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యాక్షన్ కింగ్ అర్జున్ కూడా తన సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదితను పెళ్లి చేసుకున్నాడు.

శ్రీకాంత్ – ఊహ: ‘ఆమె’ చిత్రం టైంలోనే శ్రీకాంత్, ఊహ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళ తరువాత పెళ్లి చేసుకుని జంటగా మారారు.

పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్: ‘బద్రి’ ‘జానీ’ సినిమా టైంలోనే ప్రేమలో పడిన ఈ జంట.. తరువాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకున్నారు. అయితే తరువాత విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే..!

మహేష్ బాబు – నమ్రత: ‘వంశీ’ సినిమాలో జంటగా నటించిన మహేష్, నమ్రత.. నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకుని జంటగా మారిరారు.

సూర్య – జ్యోతిక: ‘కాకా కాకా’ అనే చిత్రంలో జంటగా నటించిన సూర్య, జ్యోతిక ఆ తరువాత.. నిజంగానే పెళ్లి చేసుకుని జంటగా మారారు.తరువాత ‘నువ్వు నేను ప్రేమ’ అనే చిత్రంలో కూడా వీరు భార్యా భర్తలుగా కనిపించారు.

శివ బాలాజీ – మధుమిత: ఓ తమిళ్ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ.. నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకున్నారు.

వరుణ్ సందేశ్ – వితిక షెరు: ‘పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడి.. తరువాత పెళ్లి చేసుకుని జంటగా మారారు.

నాగ చైతన్య – సమంత: ‘చైసామ్’ ఈ కపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఏమాయ చేసావే’ ‘మనం’ చిత్రాల్లో జంటగా నటించిన ఈ జంట.. నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే..!

ఆర్య – సయేషా సైగల్: సయేషా ‘అఖిల్’ అనే తెలుగు చిత్రం ద్వారానే హీరోయిన్ గా మారింది. హీరో ఆర్య గురించి మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ ‘గజినీకాంత్’ అనే చిత్రంలో జంటగా నటించి.. నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకుని జంటగా మారారు.

టాలీవుడ్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

శేఖర్ కమ్ముల పరిచయం చేసిన యాక్టర్స్ వీరే..!

టాలీవుడ్ హీరోల పెళ్లిలు, ఖర్చు, కట్నాలు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -