Thursday, May 2, 2024
- Advertisement -

ప‌వ‌న్‌లో మార్పు శూన్యం…. ఇక మార‌డా….?

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ లో మార్పు క‌నిపించ‌డంలేదు. జనసేనపోరాట యాత్రలో భాగంగా పి.గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో మ‌రో సారి జ‌గ‌నే టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని చెప్పిన జ‌న‌సేనుడు అధికార పార్టీ టీడీపీనీ వ‌దిలి ప్ర‌జ‌ల ప‌మస్య‌ల‌పై పోరాడుతున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాజ‌కీయాల్లో ఏ పార్టీ అయినా అధికార పార్టీపై విమ‌ర్శ‌లు చేస్తారు..కాని ఏపీలో మాత్రం ప్ర‌జ‌ల ద‌రిద్రం ఏంటోగాని ఇక్క‌డ మాత్రం అంతా రివ‌ర్స్‌. ఎప్పుడు చూడు ప‌వ‌న్ టార్గెట్ అంతా జ‌గ‌నే.

గ‌తంలో కూడా జ‌గ‌న్ టార్గెట్‌గా విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ కు ధైర్యం లేద‌ని అందుకే అసెంబ్లీకి వెల్ల‌డంలేద‌ని….అదే నాకు ఎమ్మెల్యేలు ఉంటే టీడీపీనీ ఓ ఆట ఆడుకొనే వాడిన‌ని అవ‌గాహ‌ణ లేని వ్యాఖ్య‌లు చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటుగా మారింది. తాజ‌గా గ‌న్న‌వ‌రంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో మ‌ళ్లీ అవే విమర్శ‌లు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడతారని ప్రజలు ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటే.. వాళ్ల నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ స్థానంలో తానుంటే ఎమ్మెల్యేలు మొత్తం అమ్ముడుపోయినా.. ఒక్కడినైనా వెళ్లి అసెంబ్లీని స్తంభింపచేసేవాడనన్నారు. కాని జగన్ మాత్రం పిరికితనంతో అసెంబ్లీకి వెళ్లాలంటేనే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కొద్ది రోజుల క్రితం ఏపీలో లాగా తెలంగాణాలో ప్ర‌ధాని ప్ర‌తిప‌క్షం లేద‌ని చేసిన వ్యాఖ్య‌లు చేశారంటే….జ‌గ‌న్ అంటే తెలిసింది. ప‌క్క రాష్ట్రంలో ఉన్న నాయ‌కులకు జ‌గ‌న్ చ‌రిష్మా తెలుస్తుంటే …స్వ‌రాష్ట్రంలో ఉన్న ప‌వ‌న్‌కు మాత్రం జ‌గ‌న్ ధైర్యం క‌నిపించ‌డంలేదంటే ..ప‌వ‌న్‌కు ఉన్న రాజ‌కీయ ప‌రిజ్ణానం ఎంతో తెలిసిపోతుంది.

గ‌తంలో కూడా అసెంబ్లీకీ ఎందుకు వెల్ల‌లేద‌ని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లకు వైసీపీ అధినేత జ‌గ‌న్‌, ఆ ఆపార్టీ నేత‌లు స‌మాధానాలు ఇచ్చారు. జ‌గ‌న్ అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌కుండా ఎలా అడ్డుకున్నారో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. మైక్‌లు క‌ట్ చేయ‌డం, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లకు దిగ‌డం, మాట్లాడ‌డానికి ఎక్కువ టైం ఇవ్వ‌కుండా టీడీపీనేత‌లు ఎదురు దాడి చేయ‌డం లాంటి సంద‌ర్బాలు చూశాం. అందుకే జ‌గ‌న్ పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెల్లారు.

ఇక బాబుపై చేసె విమ‌ర్శ‌లు చూస్తే క‌ట్టె విర‌గొద్దు… పాము చావ‌ద్దు అనే రీతిలో విమ‌ర్శ‌లు చేస్తుంటారు. వైసీపీనుంచి 23 మంది ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసి వారిలో న‌లుగురికి మంత్రు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు బాబు. దాన్ని గురించి ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తే స‌మాధానం రాదు. పోనీ బాబునైనా గ‌ట్టిగా నిల‌దీస్తారా అంటే అదీలేదు. నీతి వంత‌మైన రాజ‌కీయాలు చేయ‌డం కోసం పార్టీ పెట్టాన‌ని చెప్పే ప‌వ‌న్‌…ఎమ్మెల్యేల కొనుగోలు అనైతికం అని తెలిసి కూడా దానిపై మాట్లాడ‌రు.

ప్రజా సమస్యలపై పోరాడతారని ప్రజలు ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటే.. వాళ్ల నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ స్థానంలో తానుంటే ఎమ్మెల్యేలు మొత్తం అమ్ముడుపోయినా.. ఒక్కడినైనా వెళ్లి అసెంబ్లీని స్తంభింపచేసేవాడనన్నారు. కాని జగన్ మాత్రం పిరికితనంతో అసెంబ్లీకి వెళ్లాలంటేనే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌కు ధైర్యం లేదు, నిజాయితీ లేదు.. ప్రతిపక్ష నేతగా మాట్లాడకపోవడం చేతగాని తనం, పిరికితనం, భయం అంటూ మండిపడ్డారు.

రాజ‌కీయాల‌ను ఒక‌సారి గ‌మ‌నిస్తే అస‌లు పిరిక‌త‌నం, భ‌యం అన్ని ప‌వ‌న్‌లోనే ఉన్నాయి. రాష్ట్రంలో జ‌రుగుతున్న అవినీతిపై బాబును ప్ర‌శ్నించలేని పిరికిత‌నం ప‌వ‌న్‌ది. ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసిన విష‌యాన్ని ప్ర‌శ్నించ‌లేని భ‌యం ప‌వ‌న్‌ది. బాబు , లోకేష్‌ల మీద తూతూమంత్రంగా విమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్ప చేసిందేమి లేదు. చేసిన విమ‌ర్శ‌ల‌కు బ‌దులిస్తారా అంటే అదీ ఉండ‌దు. ఒక స‌భ‌లో మాట్లాడిన మాట‌లు ….మ‌రో స‌భ‌లో గుర్త‌కు రావు. గ‌తంలో అడ‌పా, ద‌డ‌పా విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్ ఇప్పుడు అధికార పార్టీపై చేయ‌డంలేదు.

ఇక జ‌గ‌న్ ల‌చ్చ కోట్లు తిన్నాడ‌ని టీడీపీ నేత‌ల మాదిరే ప‌వ‌న్ మాట్లాడుతున్నారు. అసెంబ్లీలోనే జ‌గ‌న్ స‌వాల్ చేశారు. ల‌క్ష‌కోట్లు అంటున్నారు క‌దా దానిలో 5 శాతం నికివ్వండి ఎక్క‌డ సంత‌కం పెట్టాలో అక్క‌డ పెడ‌తాన‌ని స‌వాల్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌పై ఉన్న అక్ర‌మంగా బ‌ణాయించిన కేసుల్లో జ‌గ‌న్ దోషి అని స‌బీఐ నిరూపించ‌లేక పోయింది. ఎందు కంటే జ‌గ‌న్ అక్ర‌మంగా డ‌బ్బులు సంపాదించ‌లేదు కాబ‌ట్టి. జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌లో చాలా వ‌ర‌కు కోర్టు కొట్టి వేసింది. ఇవ‌న్నీ చూస్తే ప‌వ‌న్ బాబు మ‌నిషే అని అర్థ‌మ‌వ్వ‌ట్లా….ఎంతైనా ప‌వ‌న్‌కుఊడా టీడీపీ తాను ముక్కే క‌దా…..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -