Wednesday, April 17, 2024
- Advertisement -

మ‌ళ్లీ క‌న్న‌డ రాజ‌కీయాలు మొద‌టికి రానున్నాయా…?

- Advertisement -

క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రిగా కాంగ్రెస్‌-జేడీఎస్ అభ్య‌ర్తి కుమార స్వామి ప్ర‌మాణ‌స్వీకారం అంగ‌రంగ వైభ‌వంగా ముగిసింది ఈ కార్య‌క్ర‌మానికి భాజాపాయేత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల్లో ఏపార్టీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాక‌పోవ‌డంతో త‌క్కువ సీట్లు వ‌చ్చినా ల‌క్కీగా కుమార‌స్వామి సీఎం పీఠాన్ని అధిష్టించారు.

కుమార స్వామికి అస‌లైన అగ్నిప‌రీక్ష ఇప్పుడే మొద‌ల‌య్యింది. అట్ట‌హాసంగా సీఎంగా కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారం చేసినా అసెంబ్లీలో బ‌ల ప‌రీక్ష ఖ‌ఠిన‌ప‌రీక్షగా మారింది. నిన్న‌టి వ‌ర‌కు బ‌ల‌నిరూప‌న‌పై ధీమాగా ఉన్న కొత్త సీఎంలో అల‌జ‌డి మొద‌ల‌య్యింది. భాజాపాను అడ్డుకొనేందుకు బ‌ల‌వంతంగా కాంగ్రెస్‌-జేడీఎస్ క‌లిసిన విష‌యం అందిరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు మిత్రుల మ‌ధ్య విబేధాలు మొద‌ల‌య్యాయి. మంత్రి ప‌ద‌వుల పంప‌కాల‌లో తేడాలు రావ‌డంతో నేత‌లు అసంతృప్తిగా ఉన్నారు. కూట‌మి త‌రుపున ఎమ్మెల్యేల క్యాంపు రాజ‌కీయాలు న‌డ‌ప‌డంలో ముఖ్య‌పాత్ర పోషించిన శివ‌కుమార్ ఇప్పుడు అంటీ ముట్ట‌న‌ట్లుగా ఉన్నారు. డిప్యూట సీఎం ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న గుర్రుగా ఉన్నారు.

మ‌రో వైపు లింగాయ‌త్ ఎమ్మెల్యేలుకూడా అసంతృప్తితో ఉన్నారు. వారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం ప‌ద‌విని కుమార స్వామి వ్య‌తిరేకించ‌డంతో వారంతా ఉప్పుడు సీఎంమీద తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. బ‌ల‌నిరూప‌న స‌మ‌యంలో వారందూ క్రాసింగ్ ఓటుకి పాల్ప‌డితే మొద‌టికే మోసం వ‌స్తుంది.

ఇప్పుడున్న పార్టీ బ‌లాలు చూసుకుంటే భాజాపాకు 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్ 36, బీఎస్‌పీ 1, స్వ‌తంత్రులు 2. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ 111. శుక్ర‌వారం అసెంబ్లీలో కుమార‌స్వామి బ‌లాన్ని నిరూపించుకోవాలి. నిన్న‌న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శివ‌కుమార్ క్యాంపురాజ‌కీయాల‌ను న‌డిపిన సంగ‌తి తెలిసిందే.

ఎమ్మెల్యేలు అంద‌రూ బ‌ల‌నిరూప‌న అయ్యేంత వ‌ర‌కు ఎవ‌రూ బ‌య‌ట‌కు వెల్ల‌కుండా హోట‌ల్ల‌లోనే ఉన్నారు. మంత్రి ప‌దువులు రాక అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు బ‌ల‌నిరూప‌న‌లో స‌మ‌యంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డినా , హాజ‌రు కాక‌పోయినా కుమార‌స్వామి సీఎం ప‌ద‌వి మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -