Friday, April 19, 2024
- Advertisement -

క్రికెట్‌లో మీరు ఎప్పుడూ చూడ‌ని ఫ‌న్నీ ర‌నౌట్‌లు..

- Advertisement -

క్రికెట్‌లో కొన్ని సార్లు అరుదైన న‌వ్వులు పూయించే సంఘ‌ట‌న‌లు అప్ప‌డప్పుడూ చోటు చేసుకుంటాయి. తాజాగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిని టెస్ట్ మ్యాచ్‌లో న‌వ్వులు పూయించే సంఘ‌ట‌న‌ జ‌రిగాయి. ఇలా కూడా ర‌నౌట్ అవుతారా అని అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆస్ట్రేలియాతో అబుదాబి వేదికగా శుక్రవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో బంతి బౌండరీ లైన్‌ను తాకిందని భ్రమపడిన అజహర్ అలీ (64: 141 బంతుల్లో 4×4) పేలవ రీతిలో రనౌటయ్యాడు. ఇన్నింగ్స్ 53వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడెల్ బౌలింగ్‌లో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా అజహర్ హిట్ చేశాడు. బంతి వెళ్లిన వేగానికి అది కచ్చితంగా బౌండరీకి వెళ్లిపోతుందిలే అని భ్రమపడి.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌ నుంచి పరుగు కోసం వచ్చిన అసద్‌‌ని పిచ్‌ మధ్యలో ఆపి ముచ్చట్లు పెట్టాడు.

అయితే.. వేగంగా వెళ్లిన బంతి.. బౌండరీ లైన్‌కి సమీపంలోనే ఆగిపోయింది. దీంతో.. అప్పటికే బంతి వెంట పరుగెత్తుకుంటూ వెళ్లిన ఫీల్డర్ మిచెల్ స్టార్క్ వేగంగా దాన్ని అందుకుని వికెట్ కీపర్ టిమ్ పైనీకి అందించగా.. అతను వికెట్లను గీరాటేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. ఏం జరిగిందో..? తొలుత అర్థంకానట్లు తెల్లమొహం వేసిన అజహర్ అలీ.. ఆ తర్వాత థర్డ్ అంపైర్.. ఔటని ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

https://twitter.com/iconicdeepak/status/1052818746904125441

క్రికెట్‌లో అత్యంత అరుదుగా జరిగే రనౌట్లలో ఇదీ ఒకటి. అయితే ఇది జరిగిన మరుసటి రోజే ఇలాంటిదే మరో రనౌట్ జరగడం విశేషం.వెల్లింగ్టన్, ఒటాగో మధ్య జరిగిన ఫ్లంకెట్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఫన్నీ రనౌట్ చోటు చేసుకుంది. నాథన్ స్మిత్, మైకేల్ రిప్పన్ అనే ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఈ ఫన్నీ రనౌట్‌లో పాలు పంచుకున్నారు. రిప్పన్ బాల్‌ను ఫైన్ లెగ్ దిశగా కొట్టి రన్ తీశాడు. రెండో పరుగు కోసం ప్రయత్నిస్తూ నాన్ ైస్ట్రెకింగ్ ఎండ్‌లో పడిపోయాడు. ఇది చూడకుండా స్మిత్ బంతినే చూస్తూ సగం దూరం పరుగెత్తాడు. ఆ తర్వాత రిప్పన్‌ను చూసి వెనక్కి వెళ్దామనుకొనేలోపే అతను కూడా కింద పడిపోయాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ అలా నేలపై పడి ఉండగానే వెల్లింగ్టన్ వికెట్ కీపర్ లాచీ జాన్స్ వికెట్లను గిరాటేశాడు. ఈ ఫన్నీ రనౌట్ చూసి ట్విటర్ కామెంట్లతో పండుగ చేసుకుంటున్నది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -