Thursday, May 9, 2024
- Advertisement -

ఆసియా క‌ప్‌లో పాక్‌తో భార‌త్ వార్ వ‌న్‌సైడే….

- Advertisement -

ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచుల్లో భాగంగా పాక్‌ను మ‌రో సారి మ‌ట్టి క‌రిపించింది భార‌త్‌.బ్యాట్స్‌మెన్‌లు పాక్ బౌలింగ్‌ను తుక్కురేపారు. ఏధ‌శ‌లోనూ దాయాదికి అవ‌కాశం ఇవ్వ‌కుండా టీమిండియా త‌న ల‌క్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేధించింది. పాక్ నిర్ధేశించిన 238 పరుగుల టార్గెట్‌ను 39.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఇండియా లక్ష్యాన్ని ఛేదించింది.

భారత ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలతో చెలరేగిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 119 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ధావన్ 100 బంతుల్లో 114 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్డేల్లో 7 వేల పరుగుల మైలురాయిని రోహిత్ దాటాడు.

సెంచరీలు చేసిన ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ 200 పరుగుల భాగస్యామ్యాన్ని నెలకొల్పారు. 32.5 ఓవర్లలో భారత్ స్కోర్ 204 పరుగులకు చేరుకుంది. శిఖర్ ధావన్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ 210 పరుగుల స్కోరు వద్ద శిఖర్ ధావన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 33.3 ఓవర్ల వద్ద శిఖర్ ధావన్ రన్నవుట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. వంద బంతుల్లో అతను 114 పరుగులు చేశాడు. అందులో 16 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత్ ముందు 238 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, చాహల్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాకిస్తాన్ 211 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించ్ క్రమంలో అసిఫ్ అలీ 21 బంతుల్లో 30 పరుగులు చేసి చాహల్ కు దొరికిపోయాడు. మరో మూడు బంతులు మాత్రమే మిగిలి ఉన్న స్థితిలో పాకిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 234 పరుగులు వద్ద షాదాబ్ బుమ్రా బౌలింగులో అవుటయ్యాడు.

పాక్ బ్యాట్స్‌మెన్లలో షోయబ్‌ మాలిక్‌ 78 ( 90 బంతుల్లో, 78, 4 ఫోర్లు, 2 సిక్సర్లు ), సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ (66 బంతుల్లో 44, 2 ఫోర్లు ) రాణించారు. టీమిండియా మంగళవారం (సెప్టెంబరు 25) తన చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -