Saturday, April 27, 2024
- Advertisement -

ఆసియా కప్ : సూపర్ 4 లో పాక్.. మరోసారి దాయాదుల పోరు !

- Advertisement -

దుబాయ్ వేదికగా జరుగుతున్నా ఆసియా కప్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. సూపర్ 4 అదే జట్లు ఏవేవో నిన్న జరిగిన పాక్ హాంకాంగ్ మ్యాచ్ తో తేలిపోయింది. పాక్ హాంకాంగ్ మద్య జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ లో హాంకాంగ్ పై పాక్ విజయం సాధించి సూపర్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ లక్ష్యాన్ని హాంకాంగ్ ముందు ఉంచింది. మహ్మద్ రిజ్వన్ 57 బంతుల్లో 78 పరుగులు, ఫఖర్ జమన్ 41 బంతుల్లో 53 పరుగులు, షాహ్ 15 బంతుల్లో 35 పరుగులు చేశారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు 10.4 ఓవర్లలో కేవలం 38 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్ల ధాటికి హాంకాంగ్ జట్టు విలవిలాడింది. .

ఏ దశలోనూ జట్టు గెలిచే ప్రయత్నం కూడా చేయలేకపోయారు హాంకాంగ్ బ్యాట్స్ మెన్స్. దీంతో హాంకాంగ్ పై పాకిస్తాన్ 155 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం సూపర్ 4 లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక సూపర్ 4 లో ఈ ఆదివారం ఇండియాతో పాక్ మరోసారి తలపడనుంది. ఈ ఇరు జట్ల మద్య జరిగిన తొలి మ్యాచ్ లో పాక్ పై ఇండియా అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సూపర్ 4 లో ఎలాగైనా ఇండియా పై పైచేయి సాధించేందుకు పాక్ గట్టిగానే ప్రణాళికలు రచించే అవకాశం ఉంది.

ఇక బలా బలాల విషయానికొస్తే ఇరు జట్లు సమానంగా నిలిచే అవకాశం ఉంది. ఇక చిరకాల ప్రత్యర్థుల సమరానికి మరోసారి తెరలేవడంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సూపర్ 4 మరో మ్యాచ్ లో అఫ్ఘానిస్తాన్ మరియు శ్రీలంక జట్లు తలపడనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -