Monday, April 29, 2024
- Advertisement -

World Cup 2023:పాక్ చరిత్ర సృష్టిస్తుందా..?

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న హై ఓల్టేజ్ భారత్ – పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక వరల్డ్ కప్‌లో భారత్‌కు తిరుగులేదు. ఇప్పటివరకు 7 సార్లు దాయాది పాక్‌తో తలపడింది భారత్. అన్ని సార్లు భారత్‌నే విజయం వరించింది.

ఇటు భారత్ అటు పాక్ రెండు జట్లు భీకర ఫామ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌ ఆటగాళ్లు రోహిత్, గిల్ లేదా ఇషాంత్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, హార్ధిక్, జడేజా లతో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే.. బుమ్రా, సిరాజ్ లు రాణిస్తున్నారు. ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగితే అశ్విన్ తుది జట్లులో చేరే అవకాశం ఉంది.

ఇప్పటివరకు భారత్‌ని వరల్డ్ కప్‌లో ఓడించని పాక్ …ఈసారి ఆ లోటును భర్తి చేయాలని భావిస్తోంది. బౌలింగ్ విభాగంలో షహీన్ అఫ్రిది నుంచి భారత్ జట్టుకు ముప్పు పొంచి ఉండగా పాక్ మరో బౌలర్ హారిస్ రవూఫ్.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో అతడు ఒకరు. ఇక రిజ్వాన్ భీకర ఫామ్‌లో ఉండటం పాక్‌కు కలిసి వచ్చే అంశం. అలాగే అబ్దుల్లా షఫీక్ దుకుడైన ఆటతీరును ప్రదర్శిస్తుండగా షకీల్, ఇఫ్తికార్‌లు రాణిస్తే పాక్ పరుగుల వరద పారించటం ఖాయం.

తది జట్లు అంచనా..

భారత్ : రోహిత్ (కెప్టెన్), గిల్/ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్, కే.ఎల్. రాహుల్, హార్థిక్ పాండ్యా, జడేజా, షమీ/అశ్విన్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్

పాకిస్థాన్: బాబర్ అజమ్ (కెప్టెన్), షఫీక్, ఇమామ్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తికార్, షాదాబ్, నవాజ్, షాహిన్ అఫ్రిది, హసన్, రవూఫ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -