Friday, April 26, 2024
- Advertisement -

2018 ప‌ట్టాలెక్క‌నున్న బ్యాడ్మింట‌న్ కోచ్‌ పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్‌

- Advertisement -

ప్ర‌స్తుతం ప్ర‌ముఖ‌ల బ‌యోపిక్ చిత్రాల హ‌వా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికె ఇత‌ర రంగాల్లో ప్ర‌ముఖులైన వారి జీవిత చ‌రిత్ర‌లు తెర‌పై క‌నువిందు చేశాయి. తెలుగులో ఎన్టీఆర్ మీద‌నె మూడు బ‌యోపిక్ చిత్రాలు వ‌స్తున్నాయి. ఆ చిత్రాలు కూడా వివాదాస్ప‌దంకూడా అంతే ఉంటోంది. ప్ర‌స్తుతం తాజాగా బ్యాడ్మంట‌న్ స్టార్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా తీసె సినిమా ప‌ట్టాలెక్కనుంది. ఇప్ప‌టికె సైనా నెహ్మాల్ బ‌యోపిక్ రాబోతోంది.

పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్ వంటి మేటి బ్యాడ్మింట‌న్ స్టార్ల‌ను త‌యారు చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా త్వ‌రలో సినిమా తీసేందుకు సన్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయి. 2018లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అబుందాంటియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌నున్న‌ట్లు బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ తెలిపారు.

ఈ సినిమాను హిందీ, తెలుగు భాష‌ల్లో తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోందని త‌ర‌ణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. త‌న క‌థ ద్వారా చాలా మంది యువ‌త క‌ల‌లు నెర‌వేర్చుకునే అవకాశం లభిస్తుందని తెలిసి గర్వపడుతున్నట్లు గోపీచంద్ తెలిపారు. ఇప్పటికే సైనా నెహ్వాల్ జీవిత క‌థ కోసం శ్ర‌ద్ధా క‌పూర్‌కు పుల్లెల గోపీచంద్ శిక్ష‌ణ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -