Friday, March 29, 2024
- Advertisement -

జాతీయ భాష పై కొత్త రచ్చకు తెరతీసేలా కంగనా కామెంట్స్

- Advertisement -

జాతీయ భాష హిందీపై కన్నడ నటుడు సుధీప్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ మధ్య ఓ రేంజ్ లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చర్చలో బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా తలదూర్చింది. హిందీని కాదు సంస్కృతాన్ని మన జాతీయ భాష చేయాలంటూ కాస్త భిన్నంగా స్పందించింది. హిందీ, కన్నడ, తమిళం, గుజరాతీ కంటే కూడా సంస్కృతమే పురాతనమైనదంటూ కంగనా కామెంట్స్ చేసింది.

అంతేకాదు భారతీయ భాషలన్నింటికీ మూలం సంస్కృతమేనని విశ్లేషించింది. దేవభాష అయిన సంస్కృతం కంటే మరేదీ జాతీయ భాషగా ఉండేందుకు అర్హమైనది కాదంటూ వ్యాఖ్యలు చేసింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుధీన్.. హిందీ ఇంక ఏ మాత్రం జాతీయ భాష కాదంటూ వ్యాఖ్యలు చేయడంతో రచ్చ మొదలైంది. హిందీయే ఎప్పటికీ జాతీయ భాషనంటూ అజయ్ దేవగణ్ ట్వీట్ చేశారు. వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ నడిచింది.

తాజాగా కంగనా మరో వివాదాల తుట్టను కదిల్చింది. దక్షిణాది భాషలన్నింటికంటే సంస్కృతం పురాతనం అనడంతో దీనిపై మళ్లీ ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. ముఖ్యంగా తమిళుల రియాక్షన్ ఏంటన్న హాట్ టాపిక్ గా మారింది.

మరో మెగా హీరోతో కొరటాల మూవీ

సర్కారు వారి పాట సినిమా నుంచి మరో అప్ డేట్

ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఆలియా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -