Sunday, May 5, 2024
- Advertisement -

న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లండ్‌ను విశ్వ‌విజేత‌గా నిలిపిన స్టోక్స్‌ది ఏదేశ‌మో తెలుసా….?

- Advertisement -

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య నరాలు తెగే ఉత్కంఠను తలపించిన మ్యాచ్‌లో చివరకు ఇంగ్లీష్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే జ‌ట్టును విజేత‌గా నిల‌ప‌డంతో స్టోక్స్ కీల‌క పాత్ర పోషించారు. చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ‌లో అదృష్టం క‌ల‌సి వ‌చ్చి విశ్వ‌విజేత‌గా ఇంగ్లండ్ అవ‌త‌రించింది.

నిజానికి ఈ మ్యాచ్ ఫలితం తొలి నుంచి న్యూజిలాండ్‌వైపే మొగ్గింది. చివరి ఓవర్ వరకు న్యూజిలాండ్‌దే విజయమని అందరూ భావించారు. ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ కివీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇరుజ‌ట్ల స్కోర్లుకూడా స‌మంగా నిల‌బ‌డ‌టంతో సూప‌ర్ ఓవ‌ర్ ద్వారా ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది.

ఇద‌లా ఉంటె న్యూజిలాండ్‌కు ప్ర‌పంచ‌క‌ప్‌ను దూరం చేసిన స్టోక్స్‌ది సొంత దేశం న్యూజిలాండే. 28 ఏళ్ల స్టోక్స్ ఆ దేశంలోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు. ప్రపంచకప్ పైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్ అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -