Thursday, May 23, 2024
- Advertisement -

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌తో ధోనీ స‌ర‌స‌న చేరిన కోహ్లీ…

- Advertisement -

గతేడాదికి గాను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన అవార్డుల జాబితాలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పలు అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భీకరమైన ఫామ్‌తో చెలరేగిపోతూ పరుగుల మెషీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లి.. 2017 సంవత్సరానికి గాను ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులను దక్కించుకున్నాడు. దాంతో పాటు ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా కూడా కోహ్లి ఎంపికయ్యాడు.తద్వారా అరుదైన రికార్డులను కోహ్లి సొంతం చేసుకున్నాడు.

ఒకే ఏడాది ఐసీసీ వన్డే, టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన రెండో భారత కెప్టెన్‌గా కోహ్లి ఘనత వహించాడు. 2009లో ధోనీ మాత్రమే ఈ రెండు అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ముగ్గురు కెప్టెన్లు మాత్రమే ఒకే ఏడాదిలో టెస్టు, వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యారు. 2004, 2007 ఏడాదిల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఫీట్ సాధించాడు. అతడి తర్వాత ఈ ఘనత సాధించింది ధోనీ, కోహ్లి మాత్రమే.

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన విరాట్ కోహ్లి.. సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని అందుకోనున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో భారత క్రికెటర్ విరాట్ కావడం గమనార్హం. 2004లో రాహుల్ ద్రావిడ్, 2010లో సచిన్ టెండుల్కర్, 2016లో రవిచంద్రన్ అశ్విన్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -