Sunday, May 12, 2024
- Advertisement -

శ్రీలంక‌కు 322 ప‌రుగుల భారీ టార్గెట్ ఉంచిన ఇండియా…

- Advertisement -
India set Sri Lanka 322 to target he ICC Champions Trophy

లండ‌న్‌లో జ‌రుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో ఇక్కడ గురువారం శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో భారత జట్టు 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ(78;79 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్(125; 128 బంతుల్లో 15 ఫోర్లు 1 సిక్స్), ఎంఎస్ ధోని(63; 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో లంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టుకు శిఖర్ ధావన్-రోహిత్ శర్మ లు శుభారంభం అందించారు. ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చింది. ఈ క్రమంలోనే ముందుగా రోహిత్ శర్మ 58 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై శిఖర్ ధావన్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

రోహిత్ శర్మ తొలి వికెట్ గా అవుటైనప్పటికీ శిఖర్ మాత్రం మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. ధోనితో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ 82 పరుగుల జత చేసిన తరువాత శిఖర్ (125; 128 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. ఆపై హార్దిక్ పాండ్యా(9) ఐదో వికెట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు.భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.

Related

  1. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు
  2. భార‌త్ …పాక్ మ్యాచ్‌ను తిల‌కించిన విజ‌య్ మాల్యా
  3. ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కోచ్ కోసం వేట ప్రారంభించిన బీసీసీఐ
  4. ధోనిసేన‌కు,ఇండియ‌న్ ఏయిర్ ఫోర్స్ సిబ్బందికి స‌చిన్ సినిమా ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -