Friday, March 29, 2024
- Advertisement -

ఆసిస్ గ‌డ్డ‌పై చ‌రిత్రను సృష్టించిన టీమిండియా….బాక్సింగ్‌ డే టెస్ట్ మ‌న‌దే

- Advertisement -

భార‌త్ బౌల‌ర్ల ధాటికి మెల్‌బోర్న్‌లో జ‌రిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆసిస్ చేతులెత్తేసింది. 137 ప‌రుగుల తేడాతో టీమిండియా ఘ‌న‌విజ‌యం సాధించి 2-1 ఆధిక్యంలో నిలిచింది. 399 పరుగుల లక్ష్యంతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ 261 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా మ్యాచ్‌ రెండు గంటలు ఆలస్యమైనప్పటికీ విజయం వరించడానికి మాత్రం ఎంతోసేపు పట్టలేదు. కమిన్స్‌(63; 114 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్‌)ను బుమ్రా ఔట్‌ చేయగా.. నాథన్‌ లయన్‌(7; 50 బంతులు) ను ఇషాంత్‌ శర్మ పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఆసిస్ 258/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదో రోజు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కొద్దిసేపటికే కమిన్స్‌ (63), లైయన్‌ (7) ఔటవ్వడంతో భారత్‌ విజయం లాంఛనమైంది. భారత బౌలర్లలో బుమ్రా, జడేజా మూడేసి.. షమీ, ఇషాంత్‌ రెండేసి వికెట్లు తీశారు. ప్యాట్‌ కమిన్స్‌ అద్భుత అర్ధ సెంచరీతో విజయం కోసం భారత్‌ చివరి రోజు పోరాటం చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో మొత్తం 9 వికెట్లు సాధించిన బుమ్రా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి (మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నాడు. చివరి టెస్ట్‌ జనవరి 3నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను భారత్‌ కాపాడుకుంటే సిరీస్‌ భారత్‌ వశం కానుంది. తద్వారా ఆసీస్‌ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ గెలవాలనే కోహ్లిసేన లక్ష్యం నెరవేరనుంది.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 443/7 డిక్లేర్డ్‌

రెండో ఇన్నింగ్స్‌: 106/8 డిక్లేర్డ్‌

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 151

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ : 261

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -