ధావ‌న్ సెంచ‌రీ…భారీ స్కోరు దిశ‌గా టీమిండియా

- Advertisement -

ఆసిస్‌తో మొహాలీలో జ‌రుగుతున్న నాలుగో వ‌న్డేలో భార‌త్ భారీ స్కోరు దిశ‌గా దూసుకెల్తోంది. ఓపెన‌ర్ ధావ‌న్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ధావన్ 97 బంతుల్లోనే 12×4, 1×6 సాయంతో 100 సాధించాడు. వన్డే కెరీర్‌లో ధావన్‌కి ఇది 16వ శతకంకాగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (95: 92 బంతుల్లో 7×4, 2×6)తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.ఓపెన‌ర్ల జోడీని విడ‌గొట్ట‌డానికి మొద‌ట్లో ఆసిస్ చేసిన ప్ర‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఎట్ట‌కేల‌కు చివ‌ర‌కు 1వ ఓవర్ వేసిన రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ (95: 92 బంతుల్లో 7×4, 2×6) బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ హాండ్స్‌కబ్ చేతికి చిక్కాడు. దీంతో.. 193 పరుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...