Friday, April 19, 2024
- Advertisement -

టీమిండియా వంద దాట‌ని స్కోరు సంద‌ర్భాలు ఎన్ని సార్లో తెలుసా….?

- Advertisement -

హామిల్ట‌న్‌లో జ‌రిగిన నాలుగో వ‌న్డేలో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. బౌల్ట్ దెబ్బ‌కు భార‌త బ్యాట్స్‌మేన్‌లు తేతులెత్తేశారు. ట్రెంట్ బౌల్ట్ (5/21), గ్రాండ్‌హోమ్ (3/26) ధాటికి తొలుత 92 పరుగులకే కుప్పకూలిన భారత్.. అనంతరం రాస్ టేలర్ (37 నాటౌట్: 25 బంతుల్లో 2×4, 3×6), హెన్రీ నికోలస్ (30 నాటౌట్: 42 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడటంతో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.

అయితే 100 ఆట‌ని సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ఇదేమి కొత్త కాదు.ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కొని క్రీజులో కుదురుకునే లక్షణమున్న టీమిండియాను కివీస్‌ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టించారు. మరి ఇలాంటి సందర్భాలు వన్డేల్లో భారత జట్టుకు ఎప్పుడెప్పుడు ఎదురయ్యాయో ఓసార చూద్దాం.

:2000 సంవత్సరంలో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో టీమిండియా 54 పరుగులకే కుప్పకూలింది.

:1981లో ఆస్ట్రేలియాతో సిడ్నీ లో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగులకు భారత జట్టు ఆలౌట్‌ అయింది.

:కాన్పూర్‌ వేదికగా 1986లో శ్రీలంకతో జరిగిన వన్డేలో టీమిండియా 78 పరుగులకే ఇంటి ముఖం పట్టింది.

:1978లో సియాల్‌కోట్‌ స్టేడియంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 79 పరుగులు మాత్రమే చేయగలిగింది.

:2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో టీమిండియా 88 పరుగులకే ఆలౌటైంది.

:2006లో డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు 91 పరుగులకే కుప్పకూలింది.

ప్రస్తుతం హామిల్టన్‌ వేదికగా జరిగిన వన్డేలో టీమిండియా 92 పరుగులకే బ్యాట్స్‌మెన్‌ అందరూ పెవిలియన్‌కు చేరుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -