Tuesday, April 16, 2024
- Advertisement -

స‌చిన్-సేహ్వాగ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్‌-ధావ‌న్ జోడీ..

- Advertisement -

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో రోహిత్‌- ధావ‌న్ జోడీ చెల‌రేగ‌డంతో భార‌త్ 4 వికెట్లు కోల్పోయి 324 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ (87: 96 బంతుల్లో 9×4, 3×6), శిఖర్ ధావన్ (66: 67 బంతుల్లో 9×4) జోడీ.. తొలి వికెట్‌కి 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

దీంతో సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ జోడీ అరుదైన రికార్డ్‌ని బద్దలు కొట్టారు. అంతేకాకుండా వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో ఓపెనింగ్ జోడీగా రికార్డుల్లో నిలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచీ వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ కివీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు వంద ప‌రుగులకుపైగా భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌ారు.

వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీల భాగ‌స్వామ్యాలు చూసుకుంటే భారత్‌కి చెందిన సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ జోడీ 21 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత ఆడమ్ గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) 16 శతకాలు, గార్డెన్- హేన్స్ (వెస్టిండీస్) 15 శతకాలతో టాప్-3లో ఉన్నారు. తాజాగా 14 శతక భాగస్వామ్యాలతో రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ జోడీ 4వ స్థానానికి ఎగబాకింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -