Friday, April 26, 2024
- Advertisement -

ఆ దూకుడేందిరైనా…! జ‌ట్టులో ఫిక్సా…?

- Advertisement -

భారత్ టీ20 జట్టులోకి ఏడాది తర్వాత పునరాగమనం చేసిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సురేశ్ రైనా కేవలం 27 బంతుల్లోనే 5×4, 1×6 సాయంతో 43 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఓపెనర్ శిఖర్ ధావన్‌ (47: 40 బంతుల్లో 3×4)తో కలిసి రెండో వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగలిగింది.

ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే రోహిత్ శర్మ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి తన ఉద్దేశం చాటాడు. తర్వాత వచ్చిన జేపీ డుమిని బౌలింగ్‌లో ఒక ఫోర్ కొట్టిన ఈ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్.. ఐదో ఓవర్ వేసిన అండిలే బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదేశాడు.

రైనా క్రీజులో ఉన్నంతసేపూ శిఖర్ ధావన్ కనీసం ఒక ఫోర్ కూడా కొట్టలేకపోయినా.. భారత్ మెరుగైన స్కోరు సాధించిందంటే కారణం ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హిట్టింగే. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సురేశ్ రైనాకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -