Friday, March 29, 2024
- Advertisement -

టీమిండియాలో ఏంజరగుతోంది….? కెప్టెన్ కోహ్లీ ప్రెస్ మీట్ కు హాజరవుతాడా…? లేడా..?

- Advertisement -

టీమ్‌ఇండియాలో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నయన్న వాదనలు పొగలా కాదు ఏకంగా దావానలంలా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పరిస్థితులను చూస్తుంటే ఇద్దరి మధ్య విబేధాలు నిజమేనని పిస్తోంది. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా కోహ్లీ గాని రోహిత్ గాని ఓక్కమాట కూడా మాట్లాడలేదు. మరోవైపు జట్టులో ఎలాంటి విభేదాలు లేవని బీసీసీఐ చెబుతుంటే.. టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఎవరూ పెదవి విప్పడం లేదు. అసలు భారత క్రికెట్‌లో ఏం జరుగుతుందనేది ఎవరికీ అంతుచిక్కని అంశంగా మారింది.

ఈ నేపథ్యంలో విండీస్ సిరీస్ బయల్దేరే ముందు కోహ్లీ నేడు మీడియా ముందుకు రానున్నాడనె వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మీడియా సమావేశానికి కోహ్లీ డుమ్మా కొట్టాడనె వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ ఖండించింది. కచ్చితంగా కోహ్లి ప్రి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఉంటుందని పేర్కొంది. సోమవారం విండీస్‌ పర్యటనకు పయనం కానుందని, దానిలో భాగంగా కోహ్లి మీడియాతో సమావేశమవుతాడని తెలిపింది. విండీస్‌ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20లను ఫ్లోరిడా వేదికగా భారత్‌ ఆడనుంది. అక్కడ్నుంచి మిగతా ద్వైపాక్షిక సిరీస్‌ ఆడటానికి విండీస్‌ వెళ్లనుంది.

రోహిత్‌తో వివాదం వార్తల నేపథ్యంలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు దూరంగా ఉండాలని కోహ్లి నిర్ణయించుకున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలతో కొత్త వివాదం వస్తుందనే భావించే అసలు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కే హాజరు కాకూడదని కోహ్లి భావించినట్లు సమాచారం. విండీస్ పర్యటన తర్వాత ఇంటా బయటా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా తదితర దేశాలతో టీమ్‌ఇండియా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అందునా టెస్టు చాంపియన్‌షిప్ కూడా ఆరంభం కానుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ తరుణంలో కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాలు ఉంటే జట్టుకు తీవ్ర నష్టం చేకూరుస్తాయి. అందునా జట్టులోని సభ్యులు రెండుగా చీలితే దాని ప్రభావం టీమిండియా విజయాలపై పెద్ద దెబ్బ పడుతుంది. అందుకే సమస్యలను, ఆటగాళ్ల మధ్య మనస్పర్ధలపై బీసీసీఐ, సీఓఏ దృష్టి సారించి, సమసిపోయేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -