- Advertisement -

అంపైర్ , కోహ్లీ మ‌ధ్య చోటుచేసుకున్న ఆస‌క్తిక‌ర స‌న్నివేశం …

- Advertisement -

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శ్రీలంక‌తో జ‌రుగుత‌న్న మూడో వ‌న్డేలో అస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అది అంపైర్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌ధ్య జ‌రిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లి తన సొంత మైదానంలో బ్యాట్‌తో పాటు.. హావభావాలతోనూ అభిమానుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఫీల్డ్ అంపైర్ నిగేల్ లాంగ్‌ని కాసేపు కోహ్లి ఆట పట్టించాడు. శ్రీలంక ఓపెనర్ సమరవిక్రమ డీఆర్ఎస్ కోరిన సమయంలో ఈ సరదా సన్నివేశం మైదానంలో చోటు చేసుకుంది.

410 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా మంగళవారం సాయంత్రం రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించిన శ్రీలంక జట్టు ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ విసిరిన బౌన్సర్ బంతి‌ని వదిలేసే ప్రయత్నంలో సమరవిక్రమ (5) తడబడ్డాడు. పైపైకి.. వస్తున్న బంతి నుంచి తప్పించుకునే క్రమంలో భాగంగా సమరవిక్రమ వెనక్కి వంగగా.. బంతి అతని చేతి గ్లౌవ్స్‌ని తాకి స్లిప్‌లో రహానె చేతిలో పడింది. దీంతో ఫీల్డ్ అంపైర్ నిగేల్ లాంగాన్ ఔట్‌గా ప్రకటించగా.. సమరవిక్రమ ఆ నిర్ణయంపై సమీక్ష(డీఆర్ఎస్)‌కి వెళ్లాడు.

రిప్లైని థర్డ్‌ అంపైర్‌ పరిశీలిస్తుండగానే లాంగాన్‌ దగ్గరికి వెళ్లిన కోహ్లి ఔట్.. ఔట్.. ఇక ఇవ్వండంటూ కాసేపు ఆటపట్టించాడు. కోహ్లి సరదా చేష్టల్ని నిగేల్ లాంగాన్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. లంక 14 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -