Tuesday, May 7, 2024
- Advertisement -

ముంబ‌య్ సార‌థి హిట్ మ్యాన్ రోహిత్ ఖాతాలో మ‌రిన్ని రికార్డులు…

- Advertisement -

ముంబయి ఇండియన్స్‌ సారథి హిట్ మ్యాన్ రోహిత్‌ ఖాతాలో మరికొన్ని రికార్డులు చేరాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుపై అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.శుక్రవారం చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు 46 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ ‌(67; 48 బంతుల్లో 6×4, 3×6) చెలరేగడంతో ముంబయి జట్టు ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది.

సీఎస్‌కేపై 25 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 7 అర్ధసెంచరీలు బాదాడు. డేవిడ్‌ వార్నర్‌ (6), శిఖర్‌ ధావన్‌(6), కోహ్లి (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్‌ చరిత్రలో ఎక్కువ సార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్న ఇండియన్‌ క్రికెటర్లలో రోహిత్‌ ముందంజలో ఉన్నాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 17 సార్లు హిట్‌ మ్యాన్‌ ఈ అవార్డు దక్కించుకున్నాడు.

రోహిత్‌ కు చెపాక్‌ స్టేడియం చాలా బాగా కలిసొచ్చింది. ఇక్కడ ఆరు మ్యాచులు ఆడాడు. రెండు సార్లు డెక్కన్‌ ఛార్జర్స్‌(2008,2010), రెండుస్లారు ముంబయి ఇండియన్స్‌ ఆటగాడిగా (2012, 2013), మరో రెండు సార్లు ముంబయి జట్టు సారథిగా(2015,2019)గా చెపాక్‌ స్టేడియంలో ఆడాడు. వీటన్నింటిలోనూ రోహిత్‌ జట్టు విజయం సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -