Saturday, May 11, 2024
- Advertisement -

హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఇదే… మ‌రోసారి బౌల‌ర్ల‌నే న‌మ్ముకున్న స‌న్‌రైజ‌ర్స్‌

- Advertisement -

దేశ ఐటీ రాజధాని బెంగుళూరు రెండు రోజుల పాటు జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 11వ సీజన్‌ వేలం ముగిసింది. వేలంలో బెన్‌ స్టోక్స్‌ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. వేలంలో సీనియ‌ర్ ఆట‌గాల్ల‌కంటే జూనియ‌ర్ ఆట‌గాళ్ల‌కే భారీ ధ‌ర ప‌లికింది. దీంతో ఐపీఎల్ లో పాల్గొనే జట్లు పూర్తిరూపు సంతరించుకున్నాయి.

గ‌తంలో మాదిరిగా హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఈసారి కూడా బౌల‌ర్ల‌నే న‌మ్ముకుంది. దీంతో మరోసారి బలమైన బౌలింగ్ తో టైటిల్ వేటకు బయల్దేరుతోంది.

సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఆటగాళ్ల వివరాల్లోకి వెళ్తే..

డేవిడ్ వార్నర్‌ (12.5 కోట్లు), మనీష్‌ పాండే (11 కోట్లు), రషీద్‌ ఖాన్ (9 కోట్లు), భువనేశ్వర్‌ కుమార్ (8.5 కోట్లు), శిఖర్ ధావన్‌ (5.2 కోట్లు), సాహా (5 కోట్లు), సిద్ధార్థ్ కౌల్‌ (3.8 కోట్లు), దీపక్‌ హుడా (3.6 కోట్లు), ఖలీల్‌ అహ్మద్‌ (3 కోట్లు), సందీప్‌ శర్మ (3 కోట్లు), కేన్‌ విలియమ్సన్‌ (3 కోట్లు), బ్రాత్‌ వైట్‌ (2 కోట్లు), షకీబల్‌ హసన్ (2 కోట్లు), యూసుఫ్‌ పఠాన్ (1.9 కోట్లు), శ్రీవత్స గోస్వామి (కోటి), మహ్మద్ నబీ (కోటి), జోర్డాన్‌ (కోటి), బాసిల్‌ థంపి (0.95 లక్షలు), స్టాన్‌ లేక్‌ (0.50 లక్షలు), టి.నటరాజన్‌ (0.40 లక్షలు), సచిన్‌ బేబి (0.20 లక్షలు), బిపుల్‌ శర్మ (0.20 లక్షలు), మెహ్ది హసన్‌ (20 లక్షలు), రికీ భుయ్‌ (0.20లక్షలు), తన్మయ్‌ అగర్వాల్‌ (0.20 లక్షలు)లను సన్ రైజర్స్ కొనుగోలు చేసింది.

మొత్తం ఆటగాళ్ల కోసం జట్టు యాజనమాన్యం 79.35 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జట్టు వద్ద ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఇంకా 65 లక్షల రూపాయలు మిగిలి ఉండడం విశేషం. రీటెయిన్డ్ ఆటగాళ్లుగా డేవిడ్‌ వార్నర్‌, భువనేశ్వర్‌ కుమార్ లను ఉంచుకున్న జట్టు, రైట్ టు మ్యాచ్ రిజర్వ్ గా రషీద్‌ ఖాన్‌, శిఖర్‌ ధావన్‌, దీపక్‌ హుడాలను ఉంచుకుంది. మిగిలిన ఆటగాళ్లను వేలంలో సొంతం చేసుకుంది. ఇక ఐపీఎల్ స‌మ‌ర‌మే మిగిలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -