Sunday, April 28, 2024
- Advertisement -

టీ20 వరల్డ్‌కప్.. ధోనీ వ్యూహమే వల్లే గెలిచింది : హార్దిక్

- Advertisement -

మహేంద్ర సింగ్ ధోనీ.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా వ్యూహాల్ని రచిస్తూ ఉంటాడు. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిసి ధోనీ తెలివిగా వ్యూహాల్ని రచించి భారత్‌కి విజయాన్ని అందించాడు. మ్యాచ్ పోతుందేమో అన్న సమయంలో చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టిన టీమిండియా పరుగు తేడాతో విజయం దక్కించుకుంది. బంగ్లాదేశ్ విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు అవసరం ఉండగా.. ఆఖరి ఓవర్ హార్దిక్ పాండ్యా అప్పగించాడు ధోని.

మొదటి బాల్ కి మహ్మదుల్లా సింగిల్ తీయగా.. తర్వాత రెండు బంతుల్ని ముష్ఫికర్ వరుసగా 4, 4గా కొట్టాడు. దాంతో మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాలి. కానీ ఆ దశలో విన్నింగ్ షాట్ కోసం వెంపర్లాడిన బంగ్లాదేశ్ కు షాక్ తగిలింది. వరుసగా 4, 5 బంతుల్లో ముష్ఫికర్, మహ్మదుల్లా క్యాచ్‌లు ఇచ్చేయగా.. ఆఖరి బంతికి సింగిల్ తీసే ప్రయత్నంలో ముస్తాఫిజుర్ రెహ్మన్ రనౌటయ్యాడు. దాంతో చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌ని టీమిండియా ఊహించని రీతిలో ఒడిసి పట్టుకుంది. ఆ మ్యాచ్ లో చివరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యాని అందరూ మెంచుకున్న.. తెర వెనుక ధోనీ ఉన్నాడని తాజాగా పాండ్యా వెల్లడించాడు.

’నాలుగో బంతి సమయంలో బ్యాట్స్ మెన్ గా నేను క్రీజులో ఉండి ఉంటే.. మొదట సింగిల్ కి ట్రై చేసి.. తర్వాత విన్నింగ్ షాట్ గురించి ఆలోచించేవాడ్ని. ఇక లాస్ట్ బాల్ కి బంగ్లాకి రెండు పరుగులు అవసరమైన దశలో మైదానంలోని సహచరులు బౌన్సర్ సంధించమని సూచించారు. కానీ ధోనీ మాత్రం ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతి విసరాలని సూచించాడు. ఒకవేళ బౌన్సర్‌ని బ్యాట్స్‌మెన్ హిట్ చేస్తే..? అది కీపర్ పైనుంచి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ధోనీ హెచ్చరించాడు’’ అని హార్దిక్ గుర్తు చేసుకున్నాడు. చివరి బాల్ ని బంగ్లా బ్యాట్స్ మెన్ హిట్ చేయకపోయిన సింగిల్ కోసం ట్రై చేయగా.. ధోనీ రనౌట్ చేసిన సంగతి తెలిసిందే.

కోహ్లీ యువ ఆటగళ్ళకి రోల్‌ మోడల్‌.. : శ్రేయాస్

జడేజా బెస్ట్ ఫీల్డర్ అని చెప్పే సాక్ష్యం ఇది..!

సోషల్ మీడియాకు ధోనీ దూరంగా ఉండటానికి కారణం చెప్పిన సాక్షి..!

చెన్నై సూపర్ కింగ్స్ లో హిట్టర్‌ని సిద్దం చేస్తున్న ధోనీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -