Sunday, April 28, 2024
- Advertisement -

కోహ్లీ యువ ఆటగళ్ళకి రోల్‌ మోడల్‌.. : శ్రేయాస్

- Advertisement -

భారత జట్టు కెఫ్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో చాలా దూకుడుగా ఉంటారు. దాంతో జట్టులోని మిగిత ఆటగాళ్లు కూడా కోహ్లీని ఫాలో అవుతూ ఉంటారు. కానీ కోహ్లీ పరుగుల దాహం, గెలుపు కాంక్ష ఎప్పటికీ తీరనిదని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు.

జట్టులోని యువ ఆటగళ్ళకి ఓ రోల్‌ మోడల్‌ కోహ్లీ అని చెప్పుకొచ్చిన శ్రేయాస్.. ప్రత్యర్థిపై ఏమాత్రం కోహ్లీ జాలి చూపడని కితాబిచ్చాడు. గత ఏడాది నుంచి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నెం.4లో శ్రేయాస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. “కెఫ్టెన్ కోహ్లీ నుంచి ఏదైనా ప్రశంస అందుకుంటే.. ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేం. అతను నిజమైన నాయకుడు. అతను యువ ఆటగాళ్లకు రోల్ మోడల్. అంతేకాదు.. కోహ్లీ ఓ సింహంలాంటోడు. అతని ఆకలి ఎప్పటికీ తీరదు.

మైదానంలోకి ఎప్పుడు వెళ్లిన.. మొదటి మ్యాచ్ తరహాలో కసిగా ఆడుతూ.. ప్రత్యర్థిపై విరుచుకుపడుతుంటాడు. అతని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను” అని శ్రేయాస్ అయ్యారు చెప్పారు. గత ఏడాది చివరి నుంచి భారత్ జట్టులో అయ్యర్ రెగ్యులర్‌ ఆటగాడిగా కనిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో అతను ఇప్పటికే ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్‌ని కెప్టెన్‌‌గా నడిపిస్తున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కి చేరిన సంగతి తెలిసిందే.

జడేజా బెస్ట్ ఫీల్డర్ అని చెప్పే సాక్ష్యం ఇది..!

జట్టులో ధోనీ లేకుంటే… కోహ్లీ సక్సెస్ కాలేడు : వసీం జాఫర్

ప్రపంచంలో బెస్ట్ యార్కర్ బౌలర్ ఎవరో చెప్పిన బుమ్రా

యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు.. ఏం జరిగింది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -