కర్ణాటక బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీలో ట్రిఫుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ (304 నాటౌట్: 494 బంతుల్లో 28×4, 4×6) కెరీర్లో తొలిసారి ట్రిఫుల్ సెంచరీ బాదడంతో కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్ ని 628/5 వద్ద డిక్లేర్ చేసింది.
అంతకంటే ముందు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 383 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కర్ణాటక జట్టుకి లభించింది. శుక్రవారం మ్యాచ్ ముగిసే టైంకి మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్ 135/4తో ఉంది.
రీసెంట్ గా రంజీ సీజన్లో ఇప్పటికే రెండు ట్రిఫుల్ సెంచరీలు నమోదవగా.. ఈ ఘనత అందుకున్న మూడో బ్యాట్స్‌మెన్ గా మయాంక్ అగర్వాల్ నిలిచాడు. మొత్తంగా దేశవాళీ క్రికెట్లో ట్రిఫుల్ సెంచరీ బాదిన 43వ బ్యాట్స్‌మెన్.. కర్ణాటక తరుపున కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ తర్వాత మయాంక్ అగర్వాల్ 300+ మార్క్‌ని అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు.
