అడిగితే బాలయ్యకు ఆ పదవి ఇవ్వొచ్చు.. మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల బాలయ్య వైస్‌ జగన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బాలయ్య, ఎన్టీఆర్ కుమారుడు.. రామారావు ఆకాశమంత ఎత్తులో ఉంటే.. బాలయ్య ఏమో తండ్రికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

ఎన్టీఆర్‌ లాంటి గొప్ప వ్యక్తికి కుమారుడిగా పుట్టి, తండ్రికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు వెంట తిరుగుతున్నాడంటేనే బాలయ్య కెపాసిటీ ఏంటో ప్రజలకు అర్థమవుతుందన్నారు. ‘ఒకవేళ నా తండ్రికి కనుక ఎన్టీఆర్‌కు జరిగినట్లు అవమానం చేసి పార్టీ, పదవిని లాక్కుంటే నేనేంటో చూపించేవాడిని’అంటూ మంత్రి నాని చెప్పుకొచ్చారు. బాలయ్య ఆటలో అరటిపండు లాంటి వాడని, ఆయన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

- Advertisement -

ఇక టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కావాలని బాలయ్య అడుగుతున్నారట కదా, దాని కోసం ఓ పాటను కూడా సిద్దం చేసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యాడట కదా అని విలేకరు ప్రశ్నించగా… ఆ విషయం తనకు తెలియదని, ఒకవేళ అడిగితే పదవి ఇచ్చెయొచ్చని, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏముంది.. ప్రెసిడెంట్‌ పదవే అడగొచ్చని పేర్కొన్నారు. తండ్రి పార్టీ కాబట్టి ఆయన స్థాయికి పదవి అడగొచ్చు అన్నారు.

బీజేపీ, టీఆఆర్‌ఎస్‌ మధ్య తోపులాట.. మండిపడ్డ సంజయ్

షార్ట్ ఫిలిమ్స్ తో పరిచమైన నటీనటులు..!

వెంకటేష్ వైఫ్ గురించి ఆసక్తికర విషయాలు..!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News