పంత్ ఇకనైనా మేలుకో ..!

- Advertisement -

భారత్, సౌతాఫ్రికా మద్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల టీ20 సిరీస్ చివరి దశకు వచ్చింది. ఇప్పటికే ఇరు జట్లు చెరో రెండు విజయాలతో చివరి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. నేడు బెంగళూరు వేదికగా ఆఖరిపోరు జరగనుంది. ఇక ఈ చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఎగరేసుకుపోవలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలా బలాలను బేరీజు వేస్తే సమానంగా నిలిచే అవకాశం ఉంది. దాంతో సిరీస్ దక్కలంటే.. టీమిండియా మొదటి రెండు మ్యాచ్ లలోని ఓటమిలనుండి గుణపాఠం నేర్చుకొని ఈ చివరి పోరులో బరిలోకి దిగాల్సిఉంటుంది. గత రెండు మ్యాచ్ లను పరిశీలిస్తే బ్యాటింగ్, బౌలింగ్ లోనూ టీమిండియా కాస్త మెరుగ్గానే కనిపిస్తోంది.

అయితే ముఖ్యంగా రిషబ్ పంత్ కెప్టెన్సీ పైనే అందరి అనుమానాలు ఉన్నాయి. ఈ సిరీస్ కు అనుకోకుండా కెప్టెన్ అయిన పంత్.. కెప్టెన్ గా దారుణంగా విఫలం అవుతున్నాడు. కేవలం కెప్టెన్ గానే మాత్రమే కాకుండా బ్యాట్స్ మెన్ గా కూడా ఘోరంగా విఫలం అవుతున్నాడు. ఇప్పటివరకు ముగిసిన నాలుగు మ్యాచ్ లలో పంత్ చేసింది కేవలం 57 పరుగులు మాత్రమే. దాంతో పంత్ బ్యాటింగ్ శైలిపై మాజీ క్రికెటర్ల నుంచి మాత్రమే కాకుండా అభిమానుల నుంచి కూడా భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ముఖ్యంగా మాజీలు పంత్ బ్యాటింగ్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. సునిల్ గవాస్కర్, వసీం జాఫర్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానీష్ కనేరియా. ఇర్ఫాన్ పఠాన్ వంటి ప్లేయర్లు పంత్ బ్యాటింగ్ పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. షాట్ల ఎంపికలో పంత్ చాలా తడబడుతున్నాడని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అనవసరపు షాట్లతో వికెట్ పారేసుకుంటున్నాడని, జట్టు సారథే ఇలా ఇవుట్ కావడం జట్టుకు మంచిది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన నాలుగు మ్యాచ్ లలో కూడా పంత్ స్ట్రైక్ రేట్ 14.25 నుంచి 105.55 తో ఏమంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇక నేడు జరగబోయే మ్యాచ్ లోనైనా, ఫామ్ లోకి వచ్చి తనదైన శైలిలో అలరిస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -