Friday, March 29, 2024
- Advertisement -

మ‌లింగ రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్‌..

- Advertisement -

శ్రీల‌కం స్టార్ బౌల‌ర్ మ‌లింగ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగ‌తి తెలిసిందే.శుక్రవారం కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత 50 ఓవర్ల ఫార్మెట్‌కు మలింగ వీడ్కోలు ప్రకటించాడు. 2011లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన మలింగ ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అతను టీ20లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు.

35 ఏళ్ల మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. 2007, 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరడంలో అతను కీలక పాత్ర పోషించాడు. తన 15 ఏళ్ల వన్డే ప్రయాణంలో ఎన్నో రికార్డులను అందుకున్నాడు. మ‌లింగ రిటైర్మెంట్‌పై రోహిత్ శ‌ర్మ స్పందించాడు. ఐపీఎల్‌లో ముంబ‌య్ ఇండియ‌న్స్‌కు ప్ర‌ధాన బౌల‌ర్ మాలింగే.

గత దశాబ్ద కాలంలో ముంబై ఇండియన్ తరపున ఒక మ్యాచ్ విన్నర్‌ను ఎంపిక చేయమంటే.. మలింగ ముందు వరుసలో ఉంటాడు. ఓ కెప్టెన్‌గా ఉత్కంఠ పరిస్థితుల్లో తేలిగ్గా ఊపిరి పీల్చుకోవడానికి మలింగనే కారణం. భవిష్యత్తులో మలింగ‌కు మరింత మంచి జరగాలి’ అంటూ ట్వీట్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -