Friday, May 10, 2024
- Advertisement -

పాక్ ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు..

- Advertisement -

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కు మరోసారి వెస్టిండీస్ క్రికెట్ బోర్డుషాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. పాకిస్థాన్ ప‌ర్య‌ట‌న‌ను వాయిదావేసింది. ఈ ఏడాది పాకిస్తాన్ లో జరగాల్సిన ఉన్న టీ 20 సిరీస్ ను వాయిదా వేసుకునేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సన్నద్ధమవుతోంది. దీనికి ప్ర‌ధానం పాకిస్థాన్‌లో ఆటగాళ్ల భద్రత గురించి సీనియర్లు క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేయ‌డంతో ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్థాన్‌ పర్యటనను వాయిదా వేసింది. ఆ దేశంలో ఆటగాళ్ల భద్రత గురించి సీనియర్లు క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మూడు టీ20ల సిరీస్‌ కోసం విండీస్‌ పాక్‌లో పర్యటించాల్సి ఉంది. వచ్చే ఏడాది రెండు జట్లకు ఖాళీ ఉన్నప్పుడు షెడ్యూలు రూపొందిస్తామని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వర్గాలు తెలిపాయి. పీసీబీ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

పాక్‌ పర్యటన గురించి విండీస్‌ బోర్డు అభిప్రాయాలు కోరగా ఆటగాళ్లు తమ భద్రత గురించి సందేహాలు వెలిబుచ్చారు. పర్యటనకు బోర్డు సుముఖంగా ఉంటే మాత్రం తాము అందుబాటులో ఉండలేమని సీనియర్‌ క్రికెటర్లు క్రిస్‌గేల్‌, కీరన్‌ పొలార్డ్‌, డ్వేన్‌ బ్రావో స్పష్టం చేశారు. ఐసీసీ నియమించిన భద్రతా సిబ్బంది పాక్‌లో భద్రత ఏర్పాట్లపై పంపిన నివేదికపైనా వెస్టిండీస్‌ ఆటగాళ్ల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది’ అని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

భద్రతా నిపుణుల విసృత్త తనిఖీలు, సానుకూల నివేదిక తర్వాత వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు లాహోర్‌లో సెప్టెంబర్‌లో మూడు టీ20లు ఆడింది. ఈ రెండు జట్లు అక్కడ పర్యటించినా పాక్‌లో ఆడేందుకు వెస్టిండీస్‌ క్రికెటర్లు ససేమిరా అంటున్నారు. నవంబర్‌ 25 నుంచి విండీస్‌ న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. 2009, మార్చి 3న లాహోర్‌ని గఢాఫీ స్టేడియం వద్ద శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరగడంతో పాక్‌లో ఏ జట్టూ పర్యటించడం లేదు.

గతేడాది కూడా పాకిస్తాన్ లో పర్యటించడానికి విండీస్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ముందుస్తు షెడ్యూల్ ప్రకారం పాక్ లో జరగాల్సిన విండీస్ మ్యాచ్ లను తటస్థ వేదిక యూఏఈలో జరిపారు. అదే సీన్ ఇప్పడు కూడా రిపీట్ అవుతుండటంతో పాక్ క్రికెట్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -