Friday, April 19, 2024
- Advertisement -

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడ సీబీఐ ముద్దు విచార‌ణనికోరిన బాబు ఇప్పుడ చేద‌య్యిందా….!

- Advertisement -
AP CM Chandrababu Naidu rules out CBI probe into Vizag land scam

ప్ర‌తి ప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తీ చిన్న విష‌యానికి సీబీఐని వేయాల‌ని రాద్దాతం చేశారు..కాని అధికారంలో ఉంటె మాత్రం సీబీఐ చేదు. చంద్ర‌బాబు ప‌రిస్థితి అలానే ఉంది. విశాఖలో భూముల రికార్డులను మాయం చేసి ఊర్లకు ఊర్లను టీడీపీ నేతలు కబ్జా చేసిన అంశంపై చంద్రబాబు స్పందించారు.

కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ విపక్షాలు, మిత్రపక్షం బీజేపీ చేస్తున్న డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు.
ప్రతిపక్షాలడిగినట్లు అప్పట్లో సిబిఐతోనే విచారణ చేయించారు కదా కదా? మరి అదే పద్దతిలో ఇపుడు సిబిఐతో విచారణ చేయించటానికి చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారు? విచారణకు వెనకాడటమంటే భయపడుతున్నారని జనాలకు మెసేజ్ ఇవ్వటం కాదా?

{loadmodule mod_custom,GA1}

సిబిఐ విచారణకు ఇస్తే 20 ఏళ్ళు పడుతుంది’ ఇది చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. విశాఖపట్నం జిల్లాలో బయటపడిన భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్రను ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. గడచిన మూడేళ్ళుగా భయపడిన ఏ కుంభకోణం, ఏ అవినీతి విషయంలోనూ విపక్షాలు డిమాండ్ చేసినట్లు సిబిఐ విచారణకు అంగీకరించలేదు. ఎందుకంటే, సిబిఐ విచారణ దండగంటున్నారు. మరి, ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రతీ విషయానికీ చంద్రబాబు సిబిఐ విచారణనే డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఔటర్ రింగురోడ్డు నిర్మాణం, పలు సంస్ధలకు భూ కేటాయింపులు, ఫోక్స్ వ్యాగన్ కార్ల కుంభకోణం, పరిటాల రవి హత్య, జలయజ్ఞం.. ఇలా ప్రతీదానిలోనూ అవినీతి జరిగిందంటూ టిడిపి అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ప్రతీ అవినీతిపైనా సిబిఐ విచారణను డిమాండ్ చేసింది.

{loadmodule mod_custom,GA2}

వైఎస్ కూడా ప్రతిపక్షం అడిగినట్లు సిబిఐ విచారణను వేసారు, క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. క్లీన్ చిట్ రావటంపైన కూడా టిడిపి ఆరోపణలు చేసింది. అదే పద్దతిలో ఇపుడు సిబిఐతో విచారణ చేయించటానికి చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారు? విచారణకు వెనకాడటమంటే భయపడుతున్నారని జనాలకు మెసేజ్ ఇవ్వటం కాదా?

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}H70hXihAEhU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -