Friday, May 3, 2024
- Advertisement -

22న విశాఖ‌లో బిగ్ పొలిటిక‌ల్ ఫైట్‌… వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ

- Advertisement -
Political War Between YSRCP and TDP in Visakhapatnam

విశాఖ సాగ‌ర‌తీరం మ‌రో స‌మ‌రానికి సిద్ద‌మ‌వుతోంది. భూఆక్రమణలపై వైసీపీ పోరుబాట ప‌ట్టింది.దీంతో సాగ‌రం తీరాన రాజ‌కీయ స‌మ‌రం హీట్ పెంచుతోంది.విశాఖ భూ కుంభ‌కోణంపై ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు జూన్ 22 న విశాఖ‌లో మ‌హాధ‌ర్నా నిర్వ‌హిస్తోంది.

ఈ ధ‌ర్నాకు వైసీపీ అధినేత జ‌గ‌న్ హాజ‌ర‌వుతున్నారు. దీంతో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది.

{loadmodule mod_custom,GA1}

అయితే టీడీపీ కూడా వైసీపీకి పోటీగా మ‌హాసంక‌ల్పం పేరుతో టీడీపీ ధ‌ర్నా నిర్వ‌హిస్తోంది.దీంతో న‌గ‌రంలో ఆరోజు ఉద్రిక్త‌ ప‌రిస్థితులు నెల‌కొనే అవ‌కాశం ఉంది.జ‌గ‌న్ ధ‌ర్నాకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించే అవ‌కాశం ఉంది. వాస్త‌వానికి జ‌గ‌న్ ధ‌ర్నాను ఎలాగోలా అడ్డుకోవాల‌నే ఆలోచ‌న‌తోనే మ‌హా సంక‌ల్ప దీక్ష ప్లాన్ వేశారు టీడీపీ నేత‌లు. అయితే వైసీపీ మాత్రం ధ‌ర్నా నిర్వ‌హించి తీరుతాం అనే ప‌ట్టుద‌ల‌తో ఉంది.
భూకుంభ‌కోనంలో అధికార పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని దీనిపై సీబీఐ విచార‌న జ‌రిపించాల‌ని మిత్ర‌ప‌క్షం భాజాపాతోపాటు ఇత‌ర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.ఏకంగా మంత్రి గంటా హ‌స్తంఉంద‌ని..మ‌రో మంత్రి అయ్య‌న్న ఆరోప‌న‌లు చేశారు.దీనిపై సిట్‌పేరిట క‌మిటీని వేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకున్నారు బాబు.

{loadmodule mod_custom,GA2}

గ‌త జ‌న‌వ‌రి 26న రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా కోరుతూ విశాఖ బీచ్‌లో జ‌ల్లిక‌ట్టు త‌ర‌హా ఆందోళ‌న నిర్వ‌హించేందుకు జ‌గ‌న్ వెళ్ల‌గా విమానాశ్ర‌యంలోనే అరెస్ట్ చేసి తిరిగి హైద‌రాబాద్ పంపారు.ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితులే ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నారు.మ‌రి ద‌ర్నాల‌కు పోలీస్‌ల‌నుంచి అనుమ‌తి ఉంటాదాలేదా అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}cN5GvoduPi4{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -