Friday, May 3, 2024
- Advertisement -

నిప్పు పార్టీలో భూక‌బ్జా నేత‌

- Advertisement -
TDP MLC Deepak Reddy arrested in Land Mafia

టీడీపీలో అవినీతి చేప‌లు ఒక్కొక్క‌టి బ‌య‌ట ప‌డుతున్నాయి. మాపార్టీ నిప్పు అని చెప్పుకొనే బాబుకు..ఉహించ‌ని షాక్ త‌గిలింది.హైదరాబాదులో భూకుంభకోణం కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని అరెస్ట్ చేసిపోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండుకు తరలించింది. చంచల్‌గూడ జైలుకు తరలిస్తారు.

{loadmodule mod_custom,GA1}

అనంతపురం టీడీపీ ఎంపీ సీనియర్ రాజకీయ వేత్త జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు దీపక్రెడ్డి. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన జూబ్లీహిల్స్ బంజారహిల్స్ లలో దీపక్రెడ్డి గ్యాంగ్ భూకబ్జాలకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి.శాస్త్రీయ ఆధారాలతో దీపక్ రెడ్డిని అరెస్టు చేశారు హైద‌రాబాద్ పోలీసులు. అతను చనిపోయిన వ్యక్తుల పేరుతో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడని తేలింది. నకిలీ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తులతో రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఆ తర్వాత కోర్టులో పిటిషన్ వేసి, బెదిరింపులకు పాల్పడేవాడ‌ని పోలీసులు తెలిపారు.
బంజారాహిల్స్‌, ఆసిఫ్‌నగర్‌లలో రూ.165 కోట్ల విలువైన భూములను న్యాయవాది శైలేష్‌ సక్సేనా సాయంతో కబ్జా చేసేందుకు యత్నించారని ఆధారాలు లభించడంతో ఇద్దరినీ జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. దీపక్ రెడ్డి ముందస్తు బెయిలు గడువు పూర్తి కావడం, సక్సేనా బెయిలు పటిషన్‌ తిరస్కరణకు గురవడంతో ఇద్దరినీ అరెస్టు చేశామని డీసీపీ అవినాశ్‌ మొహంతీ తెలిపారు.దీపక్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ఏపీ శాసనమండలి ఛైర్మన్‌కు అధికారిక సమాచారం ఇచ్చామని వివరించారు. నకిలీ పత్రాలు సృష్టించడంలో వీరికి సహకరించిన ఆర్‌ శ్రీనివాస్‌ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.

{loadmodule mod_custom,GA2}

కాగా ఇటీవలే దీపక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అధికార తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దల సభలోకి ప్రవేశించిన దీపక్ రెడ్డి పొరుగు రాష్ట్రంలో అరెస్ట్ అవడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -