Wednesday, May 1, 2024
- Advertisement -

మంత్రా.. మజాకా…

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మంత్రిగారు గడచిన ఆరేళ్లుగా అబ్ స్కాండ్ లో ఉన్నారు. నిజం. కావాలంటే విశాఖ జిల్లా పోలీసులను అడగండి. ఆ మంత్రిగారిని పట్టుకోవడానికి అక్కడి పోలీసులు మూడు చెరువుల నీళ్లు తాగినా సరిపోక విశాఖ సముద్ర నీళ్లు కూడా తాగేస్తున్నారు.

ఇంతకీ ఈ కేసు ఏమిటంటే… ఎపి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు 2009 సంవత్సరం జనవరి 11 న తుమ్మపాల షుగర్స్ పై ఆందోళన చేశారు. ఆ సమయంలో పోలీసులపై రాళ్లు రువ్విన కేసులో 11 నెంబరు ముద్దాయిగా చేర్చారు. నిజానికి గంటా శ్రీనివాస రావే ఎ1 ముద్దాయిగా కేసు పెట్టాల్సింది.

కాని అప్పటి ఓ మంత్రిగారి దయ వల్ల 11 నెంబరు ముద్దాయిగా మార్చారు. సరు నెంబరుదేముంది కాని… ఈ కేసులో మరి మంత్రి అరెస్టు కావాలి కదా.. కాలేదు సరి కదా… ఆయన కనిపించడం లేదంటూ పోలీసులు చేతులు దులుపుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన కొన్ని వందల సార్లు విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు. ఎమ్మెల్యేగా గెలిచారు.

మంత్రి కూడా అయ్యారు. మరి ఆయన అబ్క స్కాండ్ ఎలా అయ్యారో పోలీసులకే తెలియాలి. ఇదిలా ఉంటే.. తుమ్మపాల షుగర్స్ కేసులో ఇప్పుడు మంత్రిని పూర్తిగా తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ ఉద్యమంలో పాల్గొన్న రైతులపై మాత్రం కేసులు అలాగే ఉన్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు.. చంద్రబాబు తలచుకుంటే కేసుల ఎత్తివేతకు కొదవా ఉండదు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -