Friday, May 10, 2024
- Advertisement -

కెసిఆర్ దెబ్బకి మీడియా నోరు మూస్కుంది

- Advertisement -

కొందరు చేసే వ్యాఖ్యలకు అర్ధం పర్ధం ఉండదు. జనాలతో మాట్లాడినట్టు అవసరం లేని చోట కూడా వాగేస్తూ ఉంటారు. నిన్న హైదరాబాద్ లో సింధూ ని సత్కరిస్తున్న సమయం లో తెలంగాణా డిప్యూటీ ముఖ్యమంత్రి ఆలీ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం రేపయో అందరికీ తెలిసిందే. నిన్నటికి నిన్న జరిగిన సంగతే చూద్దాం.

రియో ఒలింపిక్స్ లో సింధు రజత పతకం సాధించిందంటే అందులో ఆమె కృషి ఎంత ఉందో.. అంతే కృషి ఆమె కోచ్ గోపీచంద్ దన్న విషయాన్ని ఏ ఒక్కరూ కాదనరు. కానీ.. అలాంటి కోచ్ ను పట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ చేసిన వ్యాఖ్యలు విన్నవారంతా బిత్తరపోయే పరిస్థితి. సింధుకు స్వర్ణం తేవాలంటే మంచి కోచ్ అవసరమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏవో కొన్ని ఛానల్స్ తప్పించి.. మిగిలిన మీడియా సంస్థలు పెద్దగా ఫోకస్ చేయలేదు.

నిజానికి ఇలాంటి మాటలే వేరే ముఖ్యమంత్రి హయాంలో జరిగి ఉంటే.. మీడియా ఓ చూపు చూసేది. కానీ.. అలీ వ్యాఖ్యల్ని చాలా బ్యాలెన్స్ గా ఇచ్చారే కానీ.. ఎక్కడా ఆ వ్యాఖ్యలపై ‘వ్యాఖ్యానాల్ని’ ఇచ్చేందుకు ప్రముఖ మీడియా సంస్థలేవీ ఇష్టపడలేదు. ఎందుకిలా అంటే.. అది కేసీఆర్ సమర్థత అనే చెప్పాలి. చిన్న విషయాలకు అంత లొల్లి చేస్తారేంటని కేసీఆర్ నోటి నుంచి ఏ క్షణంలో అయినా మాట వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అంతవరకూ విషయాన్ని ఎందుకు తీసుకెళ్లాలన్నట్లుగా మీడియా సంస్థలు సంయమనం పాటించాయే కానీ దూకుడు ప్రదర్శించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -