Saturday, May 25, 2024
- Advertisement -

ఆమెని చంపి ఆమె తలని తీసుకొస్తే మిలియన్ డాలర్ లు

- Advertisement -
special news about isis

ఆమె పేరు జొన్నా పలాని. ఆమె వయసు 23 సంవత్సరాలు. 2014 లో యూనివర్సిటీ చదువును ఆపేసి సిరియా – ఇరాక్ లలో ఐ ఎస్ ఐ ఎస్ ఉగ్రవాడులకి వ్యతిరేకంగా పోతామ చేసిన ధీర వనిత ఆమె. ఆపై తన అసమాన ధైర్య సాహసాలతో కుర్దిష్  – దానిష్ మహిళా సైన్యంలో కీలకంగా ఎదిగింది.

ఆపై జూన్ 2015లో దేశాన్ని వీడి డెన్మార్క్ లోకి ప్రవేశించి, పోలీసులకు చిక్కి ప్రస్తుతం కోపెన్ హాగెన్ జైల్లో ఉంది. ఓ ఉగ్రవాద దేశం నుంచి వచ్చి, భద్రతా దళాలకు పట్టుబడ్డ కేసులో ఇరుక్కున్న ఆమెపై విచారణ నేటి నుంచి ప్రారంభం కానుండగా, నేరం నిరూపితమైతే రెండేళ్ల వరకూ శిక్ష పడవచ్చు.

ఇక ఆమె సిరియా, ఇరాక్ లలో యుద్ధంలో పాల్గొన్న సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, ఇప్పుడామె తలపై మిలియన్ డాలర్ల బహుమానాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని అరబ్ మీడియా వెల్లడించింది. సోషల్ మీడియాలోని వివిధ చానళ్లలో జొన్నా పలానీ తలపై రివార్డును ప్రకటిస్తూ ప్రకటనలు వెలువడ్డాయని తెలుస్తోంది. కాగా, “డెన్మార్క్ లేదా మరో దేశానికి నేను ఎలా కీడు చేస్తానని అనుకొంటున్నారు?. ఓ దశ అధికార సైన్యంలో నేను భాగస్వామిని. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై యుధ్ధానికి డెన్మార్క్ మద్దతిస్తూ, సైన్యానికి శిక్షణ కూడా ఇస్తోంది కదా? నాపై అభియోగాలేంటి?” అని జొన్నా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ప్రశ్నలు సంధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -