Friday, April 26, 2024
- Advertisement -

కోరిక తీరిస్తే గంట‌కు రెండు ల‌క్ష‌ల ఇస్తాన‌ని న‌టికి ఆఫ‌ర్‌

- Advertisement -

అమ్మాయిల‌ను ఆట బొమ్మలుగా చూడ‌టం ఆనాటి కాలం నుంచి వస్తోంది. స‌మాజంలో మ‌హిళ‌లపై లైంగిక వేధింపులు జ‌రుగుతునే ఉన్నాయి. సినిమా ఇండ‌స్ట్రీలో ఈ వేధింపులు కాస్తా ఎక్కువుగానే ఉంటాయి. దీనిపై కాస్టింగ్ కౌచ్ పేరిట చాలామంది మ‌హిళ న‌టులు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌పై బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. తాజాగా త‌నకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మలయాళ నటి గాయత్రి త‌న న‌ట‌న‌తో అక్క‌డ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి అందం ఆమె సొంతం. సినిమాలతో పాటు సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది గాయ‌త్రి. దీనిని ఆసరాగా తీసుకుని రోహన్ అనే కుర్రాడు త‌న కోరిక తీర్చ‌మ‌ని సోష‌ల్ మీడియాలో గాయ‌త్రిని కోరాడ‌ట‌. దీని కోసం ఆమెకు భారీగానే క్యాష్ ఆఫ‌ర్ చేశాడ‌ట‌. ఒక రాత్రికి తన కోరిక తీర్చమని దానికోసం రూ.2 లక్షలు ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. దీంతో కోపంతో ర‌గిలిపోయిన గాయ‌త్రి రోహన్ ఆఫర్ చేసిన స్క్రీన్ షాట్ ని ట్విట్టర్ లో షేర్ చేసింది.

ఈ విషయాలను బయటపెట్టిన గాయత్రి అరుణ్.. మీ అమ్మ, సోదరిల భద్రత కోసం దేవుడ్ని ప్రార్ధిస్తుంటానని పోస్ట్ పెట్టింది. ఈ విష‌యంలో గాయ‌త్రికి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. అయితే ఇది జ‌రిగి చాలా కాలం అయినట్లు తెలుస్తుంది. ఈ ఘ‌టన చాలా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -