Tuesday, May 7, 2024
- Advertisement -

చంద్రబాబుని, లోకేష్‌ని, జలీల్‌ఖాన్‌‌లను పంచ్ డైలాగ్స్‌తో ఉతికారేసిన డైలాగ్ కింగ్

- Advertisement -

2018 ముందు వరకూ కూడా ఫిరాయింపు రాజకీయాలతో జగన్‌ని ఉక్కిరిబిక్కిరి చేసిన చంద్రబాబుకు ఇప్పుడు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఒక వైపు అశోక్ గజపతిరాజు లాంటి నాయకులు బాబుతో అంటీ ముట్టనట్టుగా ఉంటూ బిజెపితో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి ఫిరాయించిన సీనియర్ నేతలు, మాజీ ఎంపిలు ఇప్పుడు జగన్ పాదయాత్రను ప్రశంశిస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు గాలానికి ప్రతిసారీ పడిపోతూ ఉండే బడా బడా వ్యాపారస్తులు కూడా ఇప్పుడు జగన్‌కే మద్దతు తెలుపుతున్నారు. నరేంద్రమోడీ, అమిత్‌షాలు కూడా బాబుని వదిలించుకుని జగన్‌కి జై కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక జాతీయ సర్వేలతో పాటు చంద్రబాబు సొంత సర్వేల్లో కూడా 2019ఎన్నికల్లో బాబుకు ఓటమి తథ్యం అన్న ఫలితాలే వస్తున్నాయి.

ఇప్పుడు చంద్రబాబుకు మరో ఝలక్ తగిలింది. చిత్తూరు జిల్లాలో మోహన్‌బాబుకు మంచి పట్టుంది. రాష్ర్టవ్యాప్తంగా కూడా ప్రజాదరణ ఉన్న సినిమా నటుడు. ఎన్టీఆర్ నుంచి చాలా మంది నాయకులతో పనిచేసేవాడు. అందుకే చంద్రబాబు, లోకేష్‌లు మోహన్‌బాబుని టిడిపిలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. పచ్చ మీడియా తోక పత్రిక అధినేత కూడా రాయబారం నడిపాడు. మోహన్ బాబు టిడిపిలో చేరడం ఖాయం అని పచ్చ పార్టీనేతలు కూడా గట్టిగా నమ్మారు.

అయితే మోహన్‌బాబు మాత్రం చంద్రబాబు, లోకేష్‌లకు తన పంచ్ డైలాగులతో ఇప్పుడు సూపర్ షాక్ ఇచ్చాడు. గాయత్రి సినిమాలో చంద్రబాబు నాయుడి వ్యవహార శైలిని తన పంచ్ డైలాగుల్లో ఉతికారేశాడు. ‘తాను వేసిన రోడ్ల మీద నడుస్తూ తనకు ఓట్లు వేయరా’ అని నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలను బెదిరించిన స్థాయిలో మాట్లాడిన చంద్రబాబు మాటలను తన పంచ్ డైలాగులతో కడిగి పారేశాడు మోహన్ బాబు. అలాగే సార్వభౌమాధికారం అని పలకలేక ప్రమాణ స్వీకారం నాడు నవ్వులు పూయించిన లోకేష్ కామెడీపై కూడా పంచ్‌లు పేల్చాడు మోహన్ బాబు. ఇక బికాంలో ఫిజిక్స్ డైలాగ్‌కి కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నుంచి లోకేష్‌తో సహా టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు పేల్చాడు మోహన్‌బాబు. ఈ మొత్తం వ్యవహారంతో తన మద్దతు జగన్‌కే అని పరోక్షంగా స్పష్టత ఇచ్చేశాడు మోహన్‌బాబు. కాంట్రాక్టులు, వ్యాపార ప్రయోజనాల్లాంటి ఎన్నో హామీలతో మోహన్‌బాబుని టిడిపిలో చేర్చుకోవాలనుకున్న చంద్రబాబు, లోకేష్‌ల ప్లాన్‌కి తన పంచ్ డైలాగ్స్‌తో సూపర్ కౌంటర్ ఇచ్చాడు మోహన్‌బాబు. బాబు, లోకేష్‌లతో పాటు పచ్చ బ్యాచ్ మొత్తానికి సూపర్ షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -