Wednesday, May 8, 2024
- Advertisement -

విషమంగా ‘రెడ్‌స్టార్’ మాదాల ఆరోగ్యం

- Advertisement -

విప్లవాత్మక సినిమాలు తీసి ‘రెడ్ స్టార్’ గుర్తింపు పొందిన నటుడు, నిర్మాత మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రంగారావు పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ మేరకు రంగారావు కుమారుడు, నటుడు డాక్టర్ మాదాల రవి మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇంకో 48 గంటల ఆగితే గానీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం అంటున్నారు’ అని రవి తన ప్రకటనలో పేర్కొన్నారు.

1980ల్లో విప్లవాత్మక సినిమాల్లో నటించడంతోపాటు ఎర్ర చిత్రాలను నిర్మించడం ద్వారా మాదాల రంగారావు ‘రెడ్ స్టార్’గా బాగా పాపులర్ అయ్యారు. ‘చైర్మన్ చెలమయ్య’,‘యువతరం కదిలింది’, ‘ఎర్ర మల్లెలు’, ‘మహాప్రస్థానం’, ‘ప్రజాశక్తి’, ‘వీరభద్రుడు’, ‘స్వరాజ్యం’, ‘మరో కురుక్షేత్రం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్ర పావురాలు’ వంటి చిత్రాల ద్వారా రంగారావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -