Friday, April 26, 2024
- Advertisement -

అందంగా ఉంటే వదలరు వీళ్ళు.. ప్రగతి ఆంటీ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది మీడియా ముఖంగా చెప్పారు. అవకాశాల పేరుతో అమ్మాయిలను వాడుకుని మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇదే విషయంమై సంచలన తార శ్రీ రెడ్డి పెద్ద ఉద్యమమే చేసిన విషయం తెలిసిందే. కెరీర్‌లో క్యాస్టింగ్ కౌచ్ సంగతులపై ఒక్కొక్కరుగా నోరు విప్పడం మొదలుపెట్టారు. తాజాగా నటి ప్రగతి చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి.

ప్రగతి గత కొన్ని రోజులుగా వర్కవుట్స్, డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాల్లో అమ్మ, అక్క, అత్త పాత్రల్లో పద్దతిగా కనిపించే ప్రగతి.. సొషల్ మీడియాలో మాత్రం కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తన హాట్ హాట్ వర్కవుట్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ ఇలా ప్రతీ ఒక్క అంశంపై స్పందించింది. ప్రధానంగా క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ.. ఓ స్థాయికి వెళ్లిన హీరోయిన్స్ అంతా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని అంటారు.

కానీ ఇండస్ట్రీలో ఎవరైతే సక్సెస్ కాలేదో వారి నుంచే ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్‌ ఫిర్యాదులు వస్తాయని చెప్పింది. ప్రస్తుతం అమ్మాయిల కోసమే సినిమాలు తీసే పరిస్థితి వచ్చిందని.. అమ్మాయి అందంగా ఉంటే చాలు దర్శకనిర్మాతలు వెంటనే అప్రోచ్ అవుతున్నారంటూ చెప్పింది. కాకపోతే క్యాస్టింగ్ కౌచ్ లాంటి అనుభవం ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ కావాలనేది ఆ వ్యక్తి మీదే ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పింది. తన విషయంలోనూ అలాంటి సంఘటనలు ఎదురయ్యాయని, అయితే అలాంటి అవకాశాలు వద్దనుకుని తప్పుకున్నానని ఆమె తెలిపింది. మొత్తానికైతే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ప్రగతి ఓ క్లారిటీ ఇచ్చింది.

ఒంటిపై ఉన్న టాటూ సీక్రెట్ చెప్పిన ప్రగతి ఆంటీ..!

శృతీ హాసన్.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి కారణం ఇదే..!

నలుగురు పెళ్లాళ్లో.. మూడు సుధీర్ కే : రోజా

శృంగారం కోసమే అమ్మాయిగా మారలేదు : జబర్దస్త్ సాయితేజ (పింకీ)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -