శృంగారం కోసమే అమ్మాయిగా మారలేదు : జబర్దస్త్ సాయితేజ (పింకీ)

- Advertisement -

జబర్దస్త్ లో లేడీ గెటప్స్ ద్వారా బాగా పాపులరైన వారిలో సాయితేజ కూడా ఒకరు. అయితే పూర్తిగా అమ్మాయిగా మారడం కోసం ఆపరేషన్ చేయించుకున్నాడు సాయి తేజ. తర్వాత అతని పేరు ప్రియాంక(పింకీ)గా మార్చుకున్నాడు. అయితే ట్రాన్స్ జెండర్ కావడం అంత ఈజీ కాదు అంటున్నారు ప్రియాంక. “అమ్మాయిగా మారినప్పుడు చాలా నొప్పిని భరించాను.

అయితే సమాజంలో ట్రాన్స్ జెండర్స్ అంటే శృంగారం అండ్ ప్రాస్టిట్యూట్ గానే చూస్తారు. అయితే ఎవరికి ఏం అనిపిస్తే అది చేస్తారు. చాలామంది సెక్స్, వ్యభిచారం కోసం టార్స్ జెండర్‌గా మారుతున్నారు. వీళ్లు చేజేతులా జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్తున్నా.. నేనైతే సెక్స్ కోసమో.. వేరే దాని కోసమో కాదు అమ్మాయిగా మారింది. నన్ను నేను స్టార్ గా చూసుకోవాలని ప్రియాంకగా మారాను. నా గోల్ జబర్దస్త్ మాత్రమేకాదు.. మంచి స్టార్ అవ్వాలి.. పెద్ద మోడల్ అవ్వాలి. జీరో సైజ్ కోసం ట్రై చేస్తున్నా.. మోడలింగ్ తెలుగులోనే కాకుండా హిందీలో చేస్తున్నా. కన్నడలో సినిమాలు చేశా కాబట్టి అక్కడ కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. నా కెరీర్ మంచిగా ఉన్నప్పుడే అమ్మాయిగా మారలని ఫిక్స్ అయ్యాను.

- Advertisement -

సర్జరీ టైంలో భయంకరమైన పెయిన్స్ ఉండేవి. బెడ్ మీద నుంచి వాష్ రూంకి వెళ్లాలంటే 20 నిమిషాల టైం పట్టేది. నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిగా మారాలని అనుకునేదాన్ని.. నాకు 20 ఏళ్లు వచ్చాక.. బాడీలో మార్పులు చూసి టాన్స్ జెండర్‌గా మారాను. అమ్మాయిగా మారకముందు టీం సభ్యులతో ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. ట్రాన్స్ జెండర్‌గా అయ్యానని వాళ్లు అవకాశాలు ఇవ్వకపోవడం.. వేరు చేయడం లాంటివి లేవు అంటూ” ప్రియాంక చెప్పుకొచ్చింది.

ఘనంగా నితిన్, శాలిని పెళ్లి..!

ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో నితిన్, శాలిని సందడి..!

‘పవర్ స్టార్’ మూవీ రివ్యూ

ముద్దులతో హీరోయిన్ ను వదిలని ‘డర్టీ హరి’..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...