Saturday, April 27, 2024
- Advertisement -

అఖిల్ సినిమా రేంజ్ ఇంతేనా..!

- Advertisement -

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చిన్న కొడుకు గా ఇండస్ట్రీ లో హీరోగా అడుగు పెట్టాడు అఖిల్ అక్కినేని. కానీ కెరీర్ లో ఇప్పటిదాకా ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయాడు. మూడు సినిమాల్లో నటించిన అఖిల్ కేవలం పరాజయాలే చవిచూశాడు. ఇక తాజాగా అక్కినేని అభిమానులు అందరూ అఖిల్ నటిస్తున్న నాలుగవ సినిమా పైన ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అఖిల్ కు మార్కెట్ బాగా పడిపోయింది అని తెలిసిన విషయమే. అందుకే ఈ నేపథ్యంలో ఈ సినిమాని చిన్న బడ్జెట్ సినిమాగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. చిన్న బడ్జెట్ సినిమా కాబట్టే అఖిల్ ను తీసుకున్నారు అని కొందరి వాదన. ఏదేమైనా గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రానికి మామూలుగా భారీ బడ్జెట్ లేకుండా చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కించనున్నారట. నిజానికి ఈ సినిమా పైన మంచి బజ్ కూడా లేదు. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలవడం వల్ల ఈ సినిమా బాగుంటే కచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల అంచనా. మరి ఈ చిన్న బడ్జెట్ సినిమా అఖిల్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -