Friday, April 26, 2024
- Advertisement -

సైకో కిల్లర్ తో ‘సీత’ హీరో

- Advertisement -

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా విడుదలైన ‘సీత’ అనే సినిమాతో కూడా సరైన హిట్ ను అందుకోలేకపోయాడు. అయితే తాజాగా బెల్లంకొండ తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాట్సాసన్’ సినిమాని తెలుగులో ‘రాక్షసుడు’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. నిమిషం నిడివి గల ఈ వీడియో సినిమా కథ గురించి చెప్పకపోయినా సినిమా ఎలా ఉండబోతోంది అని హింట్ ఇస్తోంది.

టీజర్ చూస్తే తమిళం లాగానే తెలుగులో కూడా ఈ సినిమా మొదటి నుంచి ఆఖరివరకు ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుందని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా అందరిని ఆకర్షిస్తుంది అని అనిపిస్తోంది. ఈ సినిమాలు ఆడపిల్లలను కిడ్నాప్ చేసి చంపేస్తున్న ఒక సైకో కిల్లర్ ని కనిపెట్టే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కనిపించబోతున్నాడు. రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హవీష్ ప్రొడక్షన్స్ మరియు అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మట్స సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జూలై 18 న విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -