Friday, April 26, 2024
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు షో: హిమజ, పునర్నవి సేఫ్

- Advertisement -

ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు షో మీద ఆడియన్స్ కి మంచి ఇంటరెస్ట్ వచ్చింది. నాగార్జున హోస్ట్ గా ఎలా ఉంటాడు అనే విషయం పై అందరికీ ముందుగా అనుమానాలు ఉన్నా, నాగార్జున అందరినీ వెల్కమ్ చేసిన విధానం, ఈ సారి వీకెండ్ లో అందరితో మాట్లాడిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఒక్కొక్క హౌస్ మేట్ తో మాట్లాడుతూ, వాళ్ళ ఆట తీరు ని తను హగమనించిన విధానం చెప్తూ, తనకి నచ్చిన అంశాలను లేవనెత్తి అవసరం అయినప్పుడు తిట్టి, జాగ్రత్తలు చెప్తూ నాగార్జున తనదైన శైలి లో దూసుకుపోయాడు. ఇదే షో కి ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.

ఇంకా షో లో ఆరు గురు హౌస్ మేట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. వాళ్ళు హిమజ, పునర్నవి, హేమ, రాహుల్, వితిక మరియు జాఫర్. వీరిలో ముందుగా హిమజ సేఫ్ అని ప్రకటించాడు నాగార్జున. షో ముగింపు కి వచ్చే సమయానికి పునర్నవి కూడా సేఫ్ అని ప్రకటించాడు.

ఇక చివరికి వితిక, హేమ, రాహుల్, జాఫర్ ల లో ఎవరు షో లో నుండి వెళ్ళిపోతారు, ఎవరు షో లో ఉండిపోతారు అనే విషయం ఆదివారం ఎపిసోడ్ లో చెపుతా అని నాగార్జున అందరికీ వీడ్కోలు పలికాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -