Friday, April 26, 2024
- Advertisement -

ప్ర‌దీప్‌,సుమ‌ల‌పై కేసు న‌మోదు?

- Advertisement -

ప్ర‌ముఖ తెలుగు యాంకర్స్ ప్ర‌దీప్‌,సుమ‌ల‌పై కేసు న‌మోదు చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…మా టీవీలో పెళ్లి చూపులు పేరుతో ప్ర‌దీప్ ఓ ప్రోగ్రామ్ చేస్తున్నాడు.ఈ ప్రోగ్రామ్‌లో పెళ్లి కొడుకుగా ప్ర‌దీప్ న‌టిస్తున్నాడు. 18 మంది అమ్మాయిల‌ను ఈ షోకి తీసుకువ‌చ్చి త‌మ‌కు నచ్చిన తీరుగా వ్య‌వ‌హారించ‌మ‌న‌డంపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.మొద‌టి నుంచి ఈ షోపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.తాజాగా కొంద‌రు కార్యకర్తలు ఈ షోని నిలిపివేయాలని షో నిర్వాహకులపై, ప్రదీప్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్టార్ యాంకర్ సుమ ఈ ప్రోగ్రామ్ లో భాగం కావడంతో ఎన్నడూ లేని విధంగా ఆమెపై కూడా నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. తాజాగా రాయలసీమ మహిళా సంఘం ఈ షోని నిలిపివేయాలని ధర్నా చేశారు.

కర్నూలులో శుక్రవారం కలెక్టరేట్ వద్ద కొందరు మహిళలు ప్రదీప్ పెళ్లిచూపులు షోని బ్యాన్ చేయాలని ధర్నా చేశారు. ఆడవాళ్లని అంగడి సరుకుగా చేసే అవమానిస్తోన్న ప్రదీప్, సుమ, షో యాజమాన్యం మహిళల మనోభావాలను దెబ్బతీస్తున్నారని సంఘం జిల్లా అధ్యక్షురాలు శకుంతల అన్నారు. తెలుగు ప్రజల సంప్రదాయాలను, ఆచారాలకి భాగం కలిగించే విధంగా ఈ షోని నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రదీప్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని.. సుమపై, టీవీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై వారు పోలీసుల‌కు కూడా విన‌తి ప‌త్రం అంద‌జేశారు.పోలీసులు త్వ‌ర‌లోనే సుమ‌,ప్ర‌దీప్‌లను క‌లిసి ఈ విష‌యంపై వివ‌ర‌ణ కోర‌నున్నార‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -