Saturday, April 27, 2024
- Advertisement -

దేవరకొండ కోసం పాట పాడిన సల్మాన్

- Advertisement -

మహానటి సినిమా తో తెలుగు లో అరంగేట్రం చేసిన హీరో దుల్కర్ సల్మాన్. జెమినీ గణేశన్ పాత్ర లో నటించిన సల్మాన్ అందరినీ భారీ ఎత్తున మెప్పించాడు. మలయాళం లో సూపర్ స్టార్ అయిన సల్మాన్ తెలుగు లో ఈ సినిమా తో మంచి క్రేజ్ కూడా సంపాదించాడు. మహానటి విడుదల తర్వాత చాల మంది తెలుగు లో దుల్కర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేసినా దుల్కర్ మాత్రం ఎక్కువ గా మలయాళం సినిమాలకే ప్రాధాన్యత ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు దుల్కర్ మళ్ళీ తెలుగు లో అరంగేట్రం చేసాడు. అయితే ఈ సారి ఒక తెలుగు సినిమా కోసం గాయకుడి గా మారాడు.

అయితే ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే మహానటి లో తన తో కలిసి నటించిన విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం డియర్ కామ్రేడ్ సినిమా కోసం దుల్కర్ గాయకుడి గా మారాడు. ఇంతకు ముందు మళయాళం లో ఏబీసీడీ, కామ్రేడ్ ఇన్ అమెరికా, చార్లీ సినిమా ల లో పాటలు పాడిన ఈ హీరో ఇప్పుడు డియర్ కామ్రేడ్ లో ఒక మంచి పాట తో మన ముందుకు వచ్చాడు.

ఈ పాట రికార్డింగ్ ఇటీవలే పూర్తి కాగా, ఈ పాట ని త్వరలో విడుదల చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -