Friday, April 26, 2024
- Advertisement -

గాడి తప్పిన కాజల్.. ఏం జరిగింది అసలు

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో కాజల్ అగర్వాల్ అగ్ర కథానాయికల్లో ఒకరు అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ భామ కి ప్రస్తుతం చేతిలో సరైన సినిమాలు కరువయ్యాయి. వరుస పరాజయాల తో కాజల్ కెరీర్ గాడి తప్పింది. అయితే కాజల్ మాత్రం ఇంకా మంచి అవకాశాల కోసం చూస్తుంది కానీ తనకి సంతృప్తి తీసుకొని వచ్చే లాగా ఒక్క సినిమా అవకాశం కూడా తన కళ్ళ ముందు లేకపోవడం తో నిరాశ తో నే ఇంకా ఎదురు చూపులని కంటిన్యూ చేస్తుంది.

అయితే ప్రస్తుతం కాజల్ చేతిలో ఉన్న ఏకైక పెద్ద చిత్రం భారతీయుడు 2. కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వం లో ఈ సినిమా రానుంది. సౌత్ లో ఇదొక్కటే కాజల్ చేస్తున్న పెద్ద సినిమా. అది పక్కన పెడితే, కాజల్ హిందీ లో ముంబై సాగా అనే ఇంకొక చిత్రం లో కూడా నటిస్తుంది. సంజయ్ గుప్తా ఈ సినిమా కి దర్శకుడు. ఒకప్పుడు ఒక సినిమా కి తను కోటిన్నర దాకా పారితోషికం తీసుకొనేది కానీ ప్రస్తుతం కాజల్ పారితోషికం యాభై లక్షలకి పడిపోయింది అనే టాక్ వినిపిస్తుంది. అదే నిజమైతే కాజల్ కి ఇక కష్టమే అనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -